Share News

ఆదరణను చూసి ఓర్వలేని వైసీపీ

ABN , Publish Date - Jun 13 , 2026 | 11:21 PM

కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి వైసీపీ ఓర్వలేకపోతోందని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ అన్నారు.

ఆదరణను చూసి ఓర్వలేని వైసీపీ
సంబరాలు చేసుకుంటున్న టీడీపీ నాయకులు

హామీలను అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిది

టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ

కర్నూలు అర్బన్‌, జూన్‌ 13(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి వైసీపీ ఓర్వలేకపోతోందని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ అన్నారు. కూటమి పాలనకు రెండేళ్లు పూర్తికావడంతో నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో శనివారం నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నగర అధ్యక్షుడు కొరకంచి రవి అధ్వర్యంలో కుడా చైర్మన్‌ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్‌లతో పాటు నాయకులు, కార్యకర్తల మధ్య కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. వారు మాట్లాడుతూ ఐదేళ్ల వైసీపీ అరాచకపాలనతో రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారని గుర్తుచేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీలు అన్ని అమలుచేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదన్నారు. వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు కొంకతి లక్ష్మినారాయణ, పోతురాజు రవీకుమార్‌, నాయకులు సత్రం రామకృష్ణ, గోపినాథ్‌ యాదవ్‌, చంద్రకాంత్‌, గున్నామార్క్‌, సోమి శెట్టి నవీన్‌ , మాలిని, నాయకులు, కార్యర్తలు పాల్గొన్నారు.

Updated Date - Jun 13 , 2026 | 11:21 PM