Share News

వైసీపీ పాలన అవినీతిమయం

ABN , Publish Date - Sep 18 , 2026 | 11:08 PM

గత వైసీపీ ప్రభుత్వ పాలన అంతా అవినీతి మయంగా సాగిందని, అందుకే ప్రజలు 11 సీట్లకే పరిమితం చేశారని నంద్యాల బైరెడ్డి శబరి విమర్శించారు.

వైసీపీ పాలన అవినీతిమయం

ఏపీపీఎస్సీకి, డీఎస్సీకి తేడా తెలియదు

ఎంపీ బైరెడ్డి శబరి

బనగానపల్లె, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వ పాలన అంతా అవినీతి మయంగా సాగిందని, అందుకే ప్రజలు 11 సీట్లకే పరిమితం చేశారని నంద్యాల బైరెడ్డి శబరి విమర్శించారు.శుక్రవారం బనగానపల్లె మండల టీడీపీ అధ్య క్షుడు పీవీ. కుమార్‌రెడ్డితో కలసి బనగానపల్లెలో ఆమె విలేకర్ల సమావేశం నిర్వ హించారు. ఎంపీ మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌కు ఏపీపీఎస్సీకి, డీఎస్సీకి తేడా తెలి యదన్నారు. అలాంటి వ్యక్తి గతంలో మన సీఎం కావడం ఖర్మ అన్నారు.డీఎస్సీలో అవినీతి జరిగిందని అబద్దపు ప్రచారం చేస్తూ కష్టపడి చదివి డీఎస్సీకి ఎంపికైన అభ్యర్థులను వైసీపీ నాయకులు అవమానిస్తున్నారన్నారు. వైసీపీ పాలనలో ఏపీపీ ఎస్సీలో అవినీతి జరిగిందని సిట్‌ బృందం విచారణలో తేలిందన్నారు. వచ్చే ఎన్నికల్లో పులివెందులలో కూడా వైఎస్‌ జగన్‌ను ప్రజలు ఓడిస్తారన్నారు.

Updated Date - Sep 18 , 2026 | 11:08 PM