Share News

కాలనీవాసుల జీవితాలతో ఆడుకున్న వైసీపీ

ABN , Publish Date - Jul 22 , 2026 | 12:03 AM

గత వైసీపీ ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకుండా ప్రజల జీవితాలతో ఆడుకున్నారని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ విమర్శించారు. మంగళవారం పట్టణం లోని రామలక్ష్మి కోట్టాల, ఆచారి కాలనీలలో పర్యటించారు.

కాలనీవాసుల జీవితాలతో ఆడుకున్న వైసీపీ
రామలక్ష్మి కొట్టాల కాలనీలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే

ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ

ఆళ్లగడ్డ, జూలై 21(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకుండా ప్రజల జీవితాలతో ఆడుకున్నారని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ విమర్శించారు. మంగళవారం పట్టణం లోని రామలక్ష్మి కోట్టాల, ఆచారి కాలనీలలో పర్యటించారు. కాలనీలలో ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. కొన్నింటిని అధికారులతో చర్చించి అక్కడి కక్కడే పరిష్కరించారు, వెంటనే పరిష్కారం కానివి త్వరితగతిన పరిష్కారించాలని అధికారులకు తెలియజేశారు. గత వైసీపీ నాయకులు టీడీపీ గెలిచిన వార్డుల పట్ల విక్ష చూపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం మూడు నెలల్లోపు రూ.50 లక్షలతో డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, మొదటి విడత రూ.25లక్షలతో పనులు చేస్తామని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన రెండేల్లలో మంత్రి నారాయణతో మాట్లాడి రూ.2కోట్లు మంజూరు చేయించానని, మరో రూ.4 కోట్లతో కాలువలను అభివృద్ధి చేస్తామన్నారు. కౌన్సిలర్‌ హుసేన్‌ బాషా, కమిషనర్‌ కిషోర్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ బాలస్వామి పాల్గొన్నారు.

Updated Date - Jul 22 , 2026 | 12:03 AM