Share News

అభివృద్ధిని అడ్డుకున్న వైసీపీ నాయకులు

ABN , Publish Date - Sep 17 , 2026 | 12:47 AM

నియోజకవర్గంలో అభివృద్ధి పనులను వైసీపీ నాయకులు అడ్డుకున్నారని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి విమర్శించారు. బుధవారం పట్టణంలో అర్దాంతరంగా నిలిచిపోయిన ఇండోర్‌స్టేడియం నిర్మాణ పనులను భూమి పూజ చేసి పునః ప్రారంభించారు

అభివృద్ధిని అడ్డుకున్న వైసీపీ నాయకులు
ఇండోర్‌ స్టేడియం పనులను ప్రారంభిస్తున్న మంత్రి

మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి

ఇండోర్‌ స్టేడియం పనులు పునఃప్రారంభం

బనగానపల్లె, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలో అభివృద్ధి పనులను వైసీపీ నాయకులు అడ్డుకున్నారని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి విమర్శించారు. బుధవారం పట్టణంలో అర్దాంతరంగా నిలిచిపోయిన ఇండోర్‌స్టేడియం నిర్మాణ పనులను భూమి పూజ చేసి పునః ప్రారంభించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అభివృద్ధి పనులకు నిధులు తీసుకువస్తే మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అడ్డుకున్నారన్నారు. గతంలో రూ.2 కోట్లు తెస్తే అయిదేళ్లు ఆగిపోయిందని, తిరిగి ప్రారంభిచామన్నారు. తిరిగి మంత్రి అయ్యాక ప్రభుత్వ నిధులు రూ.కోటితో పాటు సొంత నిధులు రూ.1.5 కోట్లు అదనంగా వెచ్చించి మొత్తం రూ.2 కోట్లతో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా షాదీఖానా భవనం పూర్తి చేశానని ఈనెల 20న ప్రారంభించనున్నట్లు తెలిపారు. రింగ్‌రోడ్డుకు నిధులు తెస్తే దాన్ని అడ్డుకున్నారనితిరిగి శరవేగంగా పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. దద్దనాల ప్రాజెక్టును రూ.21 కోట్లతో పూర్తిచేస్తే గత వైసీపీ ప్రభుత్వం నీరు పంపింగ్‌ చేయకుండా మోటార్లు తుప్పుపట్టేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన సొంత నిధులు రూ.25 లక్షలు వెచ్చించి మోటార్లకు మరమత్తులు చేయుంచి నీటిని విడుదల చేశానన్నారు. పట్టణంతో రూ.60 కోట్లతో అండర్‌డ్రైనేజీ పనులు చేస్తున్నామని మంత్రి న్నారు. నారాయణరెడ్డి, శంఖేశ్వర్‌రెడ్డి, రామశేఖర్‌, మాజీ సర్పంచ్‌లు తులసిరెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, సంగుశ్రీనివాసరెడ్డి, బురానుద్దీన్‌, అబ్దుల్‌ అత్తార్‌ కలాం, డైరక్టర్‌కాశీంబాబు, రాయలసీమ సలాం, ఇస్మాయిల్‌ఖాన్‌, అహమ్మద్‌హుసేన్‌, నియాజ్‌హుసేన్‌, షఫి, మద్దిలేటిరెడ్డి, పవన్‌కుమార్‌రెడ్డి, శరత్‌, భరతుడు, తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

పట్టణంలో చేస్తున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మంత్రి బీసీ ఆదేశించారు. బుధవారం ఆర్డీవో కార్యాలయం పనులను స్వయంగా పరిశీలించారు. నాణ్యత పాటించి పనులు వేగవంతంచేయాలని అఽధికారులను ఆదేశించారు.

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన సతీశ్‌కుమార్‌ను మంత్రి బుధవారం అభినందించారు. పాఠశాల అభివృద్దికి కృషి చేశారని సతీశ్‌సేవలను కొనియాడారు. ఉపాఽధ్యాయులు సత్యప్రకాశ్‌, నాగరాజు, ప్రతాప్‌, మధుసూధన్‌రావు పాల్గొన్నారు.

Updated Date - Sep 17 , 2026 | 12:47 AM