Share News

వైసీపీ నేతల నిరసన హాస్యాస్పదం

ABN , Publish Date - May 20 , 2026 | 12:05 AM

పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుపై వైసీపీ నాయకులు నిరసన చేయడం హాస్యాస్పదంగా ఉందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.

వైసీపీ నేతల నిరసన హాస్యాస్పదం
మాట్లాడుతున్న ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

కర్నూలు క్రైం, మే 19(ఆంధ్రజ్యోతి): పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుపై వైసీపీ నాయకులు నిరసన చేయడం హాస్యాస్పదంగా ఉందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. మంగళవారం ఆమె తన స్వగృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీలపైన ఎన్నో దాడులు జరి గాయని ఆరోపించారు. కరోనా సమయంలో మాస్కులు అడిగిన పాపానికి డాక్టర్‌ సుధాకర్‌ను పిచ్చివాడిని చేసి ఆయన చావుకు కారణమయ్యారని ఎద్దేవ చేశారు. తన డ్రైవర్‌ను చంపి బాడీని డోర్‌ డెలివరీ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబులాంటి ఘను లు వైసీపీలో ఉన్నారని, ఎన్నికల్లో ఓట్ల కోసం, రాజకీయ లబ్ధి కోసం, దళితుల పేరుతో రాజకీయాలు చేయడం వైసీపీ నేతలకే చెల్లుతుందన్నారు. సీఎం చంద్రబాబు రాష్ట్రంలో ఇంధన పొదుపు ఉద్యమానికి పిలుపునిచ్చారన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజలు స్వాగతిస్తున్నారన్నారు. కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యుడు మల్లెల రాజశేఖర్‌, మాజీ మార్కెట్‌ యార్డు చైర్మన పెరుగు పురుషోత్తంరెడ్డి, కల్లూరు మండల నాయకులు మాదేష్‌, నంద్యాల డీవీఎంసీ సభ్యుడు దానం పాల్గొన్నారు.

Updated Date - May 20 , 2026 | 12:06 AM