కొలిమిగుండ్లలో వైసీపీకి భారీ షాక్
ABN , Publish Date - May 25 , 2026 | 12:25 AM
మండంలోని మీర్జాపురం గగ్రామమానికి చెందిన వైసీపీ నాయకులు దాదాపు 100 కుటుంబాల వారు టీడీపీలో చేరారు
టీడీపీలో చేరిన 100 కుటుంబాలు
కొలిమిగుండ్ల, మే 24 (ఆంధ్రజ్యోతి): మండంలోని మీర్జాపురం గగ్రామమానికి చెందిన వైసీపీ నాయకులు దాదాపు 100 కుటుంబాల వారు టీడీపీలో చేరారు. దివారం మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. గ్రామానికి చెందిన మాజీ సమితి ప్రెసిడెంట్ మీర్జాపురం నారాయణరెడ్డి, కుమారులు పోరెడ్డి శ్రీరామ్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, సోదరుడు చిన్న రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. మంత్రి మాట్లాడుతూ వీరు టీడీపీలో చేరడం శుభపరిణామమ న్నారు. మంత్రి బీసీ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ది చేస్తున్నారని అండగా నిలిచేందుకు పార్టీలో చేరినట్లు మీర్జాపురం నారాయణ రెడ్డి పేర్కొన్నారు. జయచంద్రారెడ్డి, పోరెడ్డి జగన్‌మోహన్ రెడ్డి, బంకు రాంమోహన్, రమణ, బాల గుర్రప్ప, తదితరులు పాల్గొన్నారు.