ఎర్రగుడిలో వైసీపీకి ఎదురుదెబ్బ
ABN , Publish Date - Mar 02 , 2026 | 12:16 AM
నియోజకవర్గంలోని కొలిమిగుండ్ల మండలం ఎర్రగుడి గ్రామానికి చెందిన నాయకులు, కార్యకర్తలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు.
మంత్రి బీసీ సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు
బనగానపల్లె/కొలిమిగుండ్ల, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలోని కొలిమిగుండ్ల మండలం ఎర్రగుడి గ్రామానికి చెందిన నాయకులు, కార్యకర్తలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో మంత్రి మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. మంత్రి వారిని ఆహ్వానించి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరినవారందరికీ సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. గ్రామానికి చెందిన నిమ్మకాయల రంగయ్య, శేఖర్, ప్రమోద్, లాజర్, బాలయ్య, తలారి రామ్మోహన్, చిన్నహాలి, రాజశేఖర్, కంపిల్ల చిన్నసుబ్బరాయుడు తదితరులు మాట్లాడుతూ నియోజకవర్గంలో చేసుఉ్తన్న అభివృద్ధిని చూసి టీడీపీలోకి చేరామని, కలిసి పనిచేస్తామని తెలిపారు.