ఆత్మవిశ్వాసం కోల్పోతున్న వైసీపీ నాయకులు
ABN , Publish Date - Jul 11 , 2026 | 10:51 PM
రాష్ట్రంతో పాటు బనగానపల్లె నియోజకవర్గంలోను అభివృద్ధిని చూసి వైసీపీ నాయకులు ఆత్మవిశ్వాసం కోల్పోయి పిచ్చిపట్టినట్లు మాట్లాడు తున్నారని రోడ్లుభవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి విమర్శించారు.
రెండేళ్లలో ఎనలేని అభివృద్ధి
రోడ్లు, భవనాల శాఖ మంత్రి మంత్రి బీసీ
బనగానపల్లె, జూలై 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంతో పాటు బనగానపల్లె నియోజకవర్గంలోను అభివృద్ధిని చూసి వైసీపీ నాయకులు ఆత్మవిశ్వాసం కోల్పోయి పిచ్చిపట్టినట్లు మాట్లాడు తున్నారని రోడ్లుభవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి విమర్శించారు. శనివారం బనగానపల్లె మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి బీసీ విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు రావాలని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి సవాల్ విసిరారు. తేదీ చెబితే తాను చర్చకు సిద్ధంగా ఉన్నానన్నారు. ఆయన నోరు తెరిస్తే అబద్దాలు, అసత్యాలతో తనపై విమర్శిస్తున్నారన్నారు. అభివృద్ధిని చూసి గొడ్డలి పార్టీ నాయకుల్లో ఆత్మవిశ్వాసం సన్నగిల్లిందన్నారు. ప్రజల తీర్పును ఎదుర్కొనే ఽధైర్యం లేక వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని విమర్శించారు. సీఎం బనగానపల్లెకు వచ్చినప్పుడు వేలాదిగా జనం వచ్చారన్నారు. ఆ జనమే వైసీపీ విమర్శలకు సమాధానమన్నారు. రవ్వలకొండలో కాటసాని రామిరెడ్డి చేసిన అక్రమ మైనింగ్‌పై ప్రజల తరపున సీఎం చంద్రబాబు ప్రశ్నించారన్నారు. అక్రమ మైనింగ్ ద్వారా కాటసాని లాభపడి, రాష్ట్రానికి నష్టం చేశారన్నారు. బనగానపల్లెలో రింగ్‌రోడ్డు నిర్మాణం చేస్తుంటే ఓర్వలేక విమర్శలు చేస్తున్నారన్నారు. రైతులతో చర్చించి ఒప్పించి రింగ్‌రోడ్డు పనులు పూర్తి చేస్తున్నామన్నారు. రూ.1,200 కోట్లతో బనగానపల్లె నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వంలో తనకు ప్రాధాన్యత లేదని చెప్పడం మీ రాజకీయ అసహనానికి నిదర్శనమని విమర్శించారు. తన పనితీరును చంద్రబాబు పలు సార్లు ప్రశంసించారన్నారు. ప్రభుత్వంపై తనకు ఎంత గౌరవం ఉందో ప్రతి ఫైల్ చెబుతోందన్నారు. పట్టణంలో షాదీఖానా నిర్మించిన ఘనత తనదే అన్నారు. శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయాభివృద్దికి సొంత నిదులు రూ.50 లక్షలు ఖర్చు చేశామన్నారు. ముస్లింమైనార్టీలను మోసంచేసినఘనత మాజీ ఎమ్మెల్యేదన్నారు. కమ్యూనిటీ భవనాన్ని షాదీఖానా అంటూ ముస్లింలను మోసం చేసినవ్యక్తి కాటసాని అన్నారు. అప్పట్లో ప్రతిపా్‌సబుక్‌పై జగన్ ఫొటో పెట్టుకోవడం సిగ్గు చేటన్నారు. సంజామల- ముదిగేడు రోడ్డు గురించి మాట్లాడే హక్కు ఆయనకు లేదన్నారు. డానిష్ టెక్నాలజీతో పూర్తి చేశామన్నారు. తాను సీఎంను కొత్తహాస్టల్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని కోరామని దాన్ని తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు బురనుద్దీన్, ఉగ్రసేనారెడ్డి, అబ్దుల్ కలాం, అమడాల మద్దిలేటి, గౌండాబాబు, భూషన్న తదితరులు పాల్గొన్నారు.