పొలంలో అడ్డుకట్టను చూపిస్తున్న రైతులు
ABN , Publish Date - Jun 29 , 2026 | 12:10 AM
ప్రశాంతతకు మారుపేరైన రామచంద్రాపురం గ్రామంలో వైసీపీ నాయకుడు విద్వేషాన్ని రెచ్చగొడుతున్నట్లు టీడీపీ నాయకుడు మార్కురి దయానందరావు ఆరోపించారు.
నంద్యాల, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): ప్రశాంతతకు మారుపేరైన రామచంద్రాపురం గ్రామంలో వైసీపీ నాయకుడు విద్వేషాన్ని రెచ్చగొడుతున్నట్లు టీడీపీ నాయకుడు మార్కురి దయానందరావు ఆరోపించారు. రైతులు తెలిపిన మేరకు.. గ్రామం ఏర్పడి దాదాపు 70 సంవత్సరాలవుతోందని, ఎప్పుడు ఏ చిన్న సమస్య వచ్చినా సామరస్యంగా పరిష్కరించుకునే వారమన్నారు. గతంలో బెజవాడ సుబ్బారావు అనే రైతు తన పొలంలో కాలువను తవ్వుకున్నాడు. ఆ స్థలం తమదేనంటూ గ్రామానికి చెందిన ఓ వైసీపీ నాయకుడు గొడవకు దిగాడు. సుబ్బారావు రెవెన్యూ అధికారులను సంప్రదించగా, ఆ స్థలం సుబ్బారావుకు చెందినదని అధికారులు ధృవీకరించారు. పొలాలు, కాలనీల నుంచి మురుగు వస్తోందని దయానందరావు, సుబ్బయ్య తమ పొలం వద్ద అడ్డుకట్ట వేయడంతో గ్రామంలో వైసీపీ నాయకుడు గొడవకు దిగారు. రెండు రోజుల క్రితం ఓ సామాజిక వర్గానికి చెందిన వారిని తీసుకొచ్చి పొలంలో హల్‌చల్ చేశాడు. రైతులు దయానందరావు, స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.