అభివృద్ధిని అడ్డుకుంటున్న వైసీపీ
ABN , Publish Date - Apr 12 , 2026 | 11:37 PM
యాగంటి క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తుంటే వైసీపీ నాయకులు అధికారులను బెదిరిస్తూ అడ్డుకుంటున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి అన్నారు.
అధికారులను బెదిరిస్తే సహించేది లేదు
రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
యాగంటి క్షేత్రంలో రూ.5.08 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం
బనగానపల్లె, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): యాగంటి క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తుంటే వైసీపీ నాయకులు అధికారులను బెదిరిస్తూ అడ్డుకుంటున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి అన్నారు. యాగంటి ఆలయంపై పెత ్తనం పేరుతో విధ్వంసాలు సృష్టించాలనిచూస్తే సహించేది లేదని, తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని మంత్రి ఘాటు స్పందించారు. ఆదివారం యాగంటి క్షేత్రంలో రూ.5.08 కోట్లతో నిర్మిస్తున్న వివిధ అభివృద్ధి పనులకు మంత్రి భూమి పూజ చేశారు. యాగంటి క్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం రూ. 1.25 కోట్లతో 8 దుకాణాలు, 2 డార్మెటరీలు, 16 గదుల సముదాయం, రూ.3.3 కోట్ల వ్యయంతో భక్తులకు నిత్యాన్నదాన సత్రం, రూ.29లక్షలతో కొత్త లడ్డూ కౌంటర్ ఏర్పాటు, రూ.24 లక్షలతో క్యూలైన్ షెడ్ నిర్మాణం పనులకు మంత్రి బీసీ భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో యాగంటి క్షేత్రానికి ఏంచేశారో ఒక్కసారి ప్రజలు ఆలోచించాలన్నారు. కూటమి ప్రభుత్వ హయంలో ఏడాది కాలంలో యాగంటి క్షేత్రానికి రూ.5.57 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో 2021 నుంచి 24 వరకు రూ.7కోట్లు మాత్రమే వచ్చిందన్నారు. ఆ సొమ్ముకు లెక్కాపత్రం లేదన్నారు. గతంలో యాగంటి ఆలయానికి రావాల్సిన సొమ్మును ఇక్కడ పనిచేసే కొందరు భారీగా నొక్కేశారని ఆరోపించారు. శివయ్య సొమ్మును కాజేసిన ఏ ఒక్కరూ బాగుపడరన్నారు. ఆదాయానికి గండి కొట్టిన ప్రతి ఒక్కరి సంగతి తేలుస్తానన్నారు. ఆలయంలో రాజకీయాలు చేస్తున్న వ్యక్తిపై కఠిన చర్యలు తప్పవన్నారు. ఇప్పటికే సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో పార్కింగ్ స్థలం ఏర్పాటు చేశామన్నారు. వైసీపీ నేతలు పార్కింగ్ స్థలంపై కూడా పిటీషన్‌లు వేయడం దుర్మార్గమన్నారు. వసతి సముదాయాలు, అన్నదాన సత్రం నిర్మిస్తుంటే ఇక్కడ పనిచేసే దేవదాయశాఖ అఽధికారులను బెదిరిస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో నరేంద్రనాథ్‌రెడ్డి, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ డి.పాండురంగారెడ్డి, ఆలయ చైర్మన్ బండి మౌళీశ్వరరెడ్డి, తహసీల్దార్ పవన్‌కుమార్‌రెడ్డి, ఎండోమెంట్ డీఈ శ్రీనివాసులు, టీడీపీ నాయకులు కాటసాని చంద్రశేఖర్‌రెడ్డి, ఆలయ మాజీ చైర్మన్ బత్తుల బాలిరెడ్డి, మాజీ సర్పంచ్ మహేశ్వరరెడ్డి, బురానుద్దీన్, భూషన్న, దస్తగిరి, నాగరాజు, జనసేన భాస్కర్, పాలకవర్గ సభ్యులు తిరుమలయ్య, శ్రీరాములు, భరతుడు, సురేశ్, రామశేఖర్ పాల్గొన్నారు.