Share News

సీఎంని విమర్శించే అర్హత వైసీపీకి లేదు

ABN , Publish Date - Sep 15 , 2026 | 11:21 PM

కూటమి ప్రభుత్వాన్ని, సీఎం చంద్రబాబును విమర్శించే అర్హత వైసీపీకి లేదని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.

సీఎంని విమర్శించే అర్హత వైసీపీకి లేదు
మాట్లాడుతున్న మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

సంజామల, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి) : కూటమి ప్రభుత్వాన్ని, సీఎం చంద్రబాబును విమర్శించే అర్హత వైసీపీకి లేదని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిషత్‌ కార్యాలయంలో అధికారుల సమీక్ష అనంతరం కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అక్రమ కేసులకు బ్రాండ్‌ అంబాసిడర్‌ వైసీపేనని అన్నారు. వైసీపీ ఐదేళ్లలో చేయలేని అభివృద్ధిని కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేసి చూపిందన్నారు. ఎల్‌నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా తాగునీటి సమస్య ఎదుర్కొంటుంటే వైసీపీ నాయకులు కాల్వలు, వంకలు వద్ద ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఎక్కడా నీటి ఎద్దడి రాకుండా సీఎం చంద్రబాబు చర్యలు తీసుకుం టారన్నారు. కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను ప్రజాస్వా మ్యబద్ధంగా నిర్వహిస్తుందని, గెలుపోటములు ప్రజలే నిర్ణయిస్తారన్నారు.

Updated Date - Sep 15 , 2026 | 11:21 PM