టిడ్కో గృహాలను గాలికి వదిలేసిన వైసీపీ
ABN , Publish Date - Oct 02 , 2026 | 12:07 AM
గత వైసీపీ ప్రభుత్వం టిడ్కో గృహాలను పట్టించుకోకుండా గాలికి వదిలేసిందని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ విమర్శించారు. గురువారం పట్టణంలోని యేసునాథపురంలో పింఛన్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
ఆళ్లగడ్డ, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వం టిడ్కో గృహాలను పట్టించుకోకుండా గాలికి వదిలేసిందని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ విమర్శించారు. గురువారం పట్టణంలోని యేసునాథపురంలో పింఛన్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. టిడ్కో ఎండీతో మాట్లాడి రూ.70 లక్షలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. నూతన పింఛన్లకు 6వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని అర్హులందరరికీ అందిస్తామని చెప్పారు. అలాగే పట్టణంలో 376 గృహాలె మంజూరు చేయించానని, రోడ్లు, డ్రైనేజీ, పార్కులు మన్సిపల్ భవనం పనులకు రూ.21కోట్లు మంజూరు అయ్యాయని తెలిపారు. ఎంపీడీవో నూర్జహాన్ పాల్గొన్నారు.
అభివృద్ధి పనుల ప్రారంభం
ఉయ్యాలవాడ: మండలంలోని ఆర్.జంబులదిన్నె గ్రామంలో రూ.1.80 కోట్ల అభివృద్ధి పనులను ఎమ్మెల్యే గురువారం ప్రారంభించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కల్వర్టు, తాగునీటి పథకం, సీసీ రోడ్లను ప్రారంభించారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. వైసీపీ నాయకులు విమర్శలు చేయటం సరికాదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ నాయకులను చిత్తుచిత్తుగా ఓడించాలని గ్రామస్తులకు పిలుపునిచ్చారు. కన్వీనర్ బోరెడ్డి రాజశేఖర్‌రెడ్డి చిట్టెపు రాజగోపాల్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, మారంరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, కూడాల నారాయణరెడ్డి, పల్లె బాబుల్‌రెడ్డి, పేరెడ్డి మోహన్‌రెడ్డి, కర్నాటి మహేశ్వరరెడ్డి, రామస్వామిరెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, ప్రసాద్‌రెడ్డి, హరిప్రసాద్‌రెడ్డి ఉన్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం
దొర్నిపాడు/శిరిశెళ్డ: పార్టీ కార్యాలయంలో నియోజకవర్గంలోని 43 మంది బాధితులకు రూ.20,84,043 సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. టీడీపీ నాయకుడు చవ్వా శివారెడ్డి ఆధ్వరం్యలో కొండాపురం గ్రామానికి చెందిన సోముల నాగిరెడ్డి, చౌడు ప్రభాకర్‌రెడ్డి, రామిరెడ్డికి, శిరివెళ్ల గ్రామానికి చెందిన నాగ లింగమ్మకు అందజేశారు.