Share News

శాంతి భద్రతలు దెబ్బతీసేలా వైసీపీ కుట్రలు

ABN , Publish Date - Jun 02 , 2026 | 12:27 AM

రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతీసేలా వైసీపీ కుట్రలు పన్నుతోందని టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు, పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత అన్నారు.

శాంతి భద్రతలు దెబ్బతీసేలా వైసీపీ కుట్రలు
మాట్లాడుతున్న ఎమ్మెల్యేలు గౌరు చరిత, గిత్తా జయసూర్య

కల్లూరు, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతీసేలా వైసీపీ కుట్రలు పన్నుతోందని టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు, పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత అన్నారు. సోమవారం మాధవీనగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్యతో కలిసి ఆమె సమావేశం నిర్వహించారు. గౌరుచరిత మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ర్టానికి రూ.20లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం నుంచి పరిశ్రమలు వెళ్లిపోగా సీఎం చంద్రబాబు ఇమేజ్‌తో రాష్ర్టానికి పరిశ్రమలు వెల్లువగా వస్తున్నాయన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం మోగా డీఎస్సీ విజయవంతంగా చేపట్టిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఈవీ.రమణ, మంచాలకట్ట శ్రీనివాసరెడ్డి, పెరుగు పురుషోత్తంరెడ్డి, జనార్దన్‌ఆచారి, ప్రభాకర్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 02 , 2026 | 12:27 AM