Share News

ఓటమి భయంతోనే వైసీపీ బాయ్‌కాట్‌ డ్రామా

ABN , Publish Date - Nov 02 , 2026 | 12:22 AM

పట్టణంలో జరుగుతున్న మున్సిపల్‌ ఎన్నికల్లో వైసీపీ ఓటమి భయంతోనే బాయ్‌కాట్‌ డ్రామా మొదలు పెట్టిందని ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్‌ రెడ్డి ఫైర్‌ అయ్యారు.

ఓటమి భయంతోనే వైసీపీ బాయ్‌కాట్‌ డ్రామా

బుగ్గనపై ఎమ్మెల్యే కోట్ల ఫైర్‌

డోన్‌ టౌన్‌, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో జరుగుతున్న మున్సిపల్‌ ఎన్నికల్లో వైసీపీ ఓటమి భయంతోనే బాయ్‌కాట్‌ డ్రామా మొదలు పెట్టిందని ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్‌ రెడ్డి ఫైర్‌ అయ్యారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బాయ్‌కాట్‌ ఎన్నికల రోజు కాదు బుగ్గనా.... ఎన్నికల ముందే చేయాలని సూచించారు. గత ప్రభుత్వంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారని, ఈ నీచ సంస్కృతి గొడ్డలి పార్టీకే దక్కుతుందని ధ్వజమెత్తారు. ప్రస్తుతం ప్రశాంతంగా జరుగుతున్న ఎన్నికలను వైసీపీ ఎందుకు బాయ్‌కాట్‌ చేస్తుందో అర్థం కావడం లేదన్నారు. టీడీపీపై నిందలు వేయడం కోసమే బాయ్‌కాట్‌ డ్రామా ఆడారని, ఇది వైసీపీ నీచ రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. టీడీపీపై నిందులు వేస్తే ఊరుకునేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - Nov 02 , 2026 | 12:22 AM