Share News

బీసీలకు ద్రోహం చేసిన వైసీపీ

ABN , Publish Date - Oct 09 , 2026 | 11:08 PM

గొడ్డలి పార్టీ వైసీపీ నాయకులు 34 శాతం బీసీ రిజర్వేషన్‌పై కోర్టులకు వెళ్లి అడ్డుకుని బీసీలకు తీరని ద్రోహం చేశారని ఎంపీ బస్తిపాటి నాగరాజు మండిపడ్డారు.

బీసీలకు ద్రోహం చేసిన వైసీపీ

ఎంపీ బస్తిపాటి నాగరాజు

కర్నూలు అర్బన్‌ , అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): గొడ్డలి పార్టీ వైసీపీ నాయకులు 34 శాతం బీసీ రిజర్వేషన్‌పై కోర్టులకు వెళ్లి అడ్డుకుని బీసీలకు తీరని ద్రోహం చేశారని ఎంపీ బస్తిపాటి నాగరాజు మండిపడ్డారు. నగరంలోని తన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం వేసిన పిటిషన్‌ను కొట్టి వేయడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు న్యాయం చేయాలన్నదే టీడీపీ లక్ష్యమని, బీసీల హక్కులను అడ్డుకోవడమే వైసీపీ వైఖరి అని అన్నారు. చట్ట పరంగా బీసీలకు న్యాయం చేయలేకపోయినా.. పార్టీ పరంగా న్యాయం చేస్తామన్నారు. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా మారుస్తున్న వైసీపీకి స్థానిక సంస్థల్లో బీసీలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు.

Updated Date - Oct 09 , 2026 | 11:08 PM