కంటికి కనిపించదా?
ABN , Publish Date - Jan 16 , 2026 | 11:53 PM
కర్నూలు ప్రాంతీయ కంటి ఆసుపత్రి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి వెళ్లే ప్రధాన దారి గుంతలమయంగా మారింది.
కర్నూలు హాస్పిటల్, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): కర్నూలు ప్రాంతీయ కంటి ఆసుపత్రి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి వెళ్లే ప్రధాన దారి గుంతలమయంగా మారింది. దీంతో ఈ రహదారి వెంట వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా ఈ రహదారి గుండా కంటి ఆసుపత్రికి వృద్దులైన రోగులు ఆపరేషన్ కోసం వస్తుంటారు. ఈ వృద్దులను దృష్టిలో పెట్టుకుని గుంతల రోడ్డుకు మరమ్మతులు చేయించాలని రోగులు కోరుతున్నారు.