Share News

రహ'దారుణాలు'

ABN , Publish Date - May 14 , 2026 | 12:37 AM

మండలంలోని గ్రామాల రహదారులు గుంతలమయంగా ఉన్నాయి. దీంతో రాకపోకలకు వాహనదారులు, రైతులు, పాదచారులు బ్బందులు పడుతున్నారు.

రహ'దారుణాలు'
డి.కొట్టాల - పెద్దకంబలూరు రహదారి ఇలా..

రుద్రవరం మండలంలో రైతులు, ప్రజల ఇబ్బందులు, పలు చోట్ల కల్వర్టులు లేని కాలువలు

రుద్రవరం, మే 13 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గ్రామాల రహదారులు గుంతలమయంగా ఉన్నాయి. దీంతో రాకపోకలకు వాహనదారులు, రైతులు, పాదచారులు బ్బందులు పడుతున్నారు. పెద్దకంబలూరు, డి.కొట్టాల, శ్రీరంగాపురం, కోడకోంట, కె.కొతూరు, బీరవోలు, కెకొత్తూరు-యల్లావత్తుల, బినాగిరెడ్డిపల్లె-పేరూరు, తువ్వపల్లె-రుద్రవరం, లింగందిన్నె-అహోబిళం రోడ్డు, రుద్రవరం-అహోబిళం రోడ్డు, చిన్నకంబలూరు-అప్పనపల్లె, తిమ్మనపల్లె-నరసాపురం, ఆలమూరు-తిమ్మననల్లె ,ముత్తలూరు-నల్లవాగుపల్లె, నాగులవరం-కొత్తపల్లె నాగులవరం-టి.లింగందిన్నె గ్రామాల రహదారులు సరిగా లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

కాల్వలపై కల్వర్టులు లేక ఇబ్బంది

కోటకొండ, శ్రీరంగాపురం గ్రామాల మధ్య కాల్వలపై కల్వర్టులు నిర్మించలేదు కె.కొత్తూరు, బీరవోలు గ్రామాల మధ్య ఉన్న వాగులపై ఉన్న కల్వర్టు కూలిపోయింది. తువ్వల్లె, రుద్రవరం గ్రామాల మధ్య నేలవంతెన ఉంది. అక్కడ కూడా కల్వర్టు నిర్మించలేదు.

అధ్వానంగా సర్వీసు రోడ్డు

చాగలమర్రి, మే 13 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని 40వ జాతీయ రహదారి పక్కన సర్వీసు రోడ్డు అధ్వానంగా మారింది. మల్లెవేముల ఫ్లైవోవర్‌ నుంచి కూలూరు రహదారి వరకు సర్వీసు రహదారి ముళ్లకంప, గుంతలతో నిండుకోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. రాత్రిళ్లు ఆదమరిస్తే ప్రమాదాలకు గురి కావాల్సిందే. హైవే, టోల్‌ అధికారులు స్పందించి రహదారులకు మరమ్మతులు చేసి ముళ్ల కంప తొలగించి ప్రమాదాలు జరుగకుండా చూడాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు.

Updated Date - May 14 , 2026 | 12:38 AM