భక్తిశ్రద్ధలతో పాద పద్మారాధన
ABN , Publish Date - Feb 03 , 2026 | 11:34 PM
పట్టణంలోని సంజీ వనగర్ రామాలయంలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి అష్టాదళపాదపద్మారాధన సేవ నిర్వహించారు.
నంద్యాల కల్చరల్, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని సంజీ వనగర్ రామాలయంలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి అష్టాదళపాదపద్మారాధన సేవ నిర్వహించారు. మంగళవారం మాఘమా సం సందర్భంగా అర్చకులు శ్రీకాంతశర్మ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో స్వామి వారికి ఉదయం సుప్రభాతసేవ, పంచామృతాభిషే కాలు నిర్వహించి పట్టువసా్త్రలతో అలంకరిం చారు. అనంతరం 108 బంగారుపుష్పాలచే స్వామివారికి అష్టోత్తర శతనామావళి పఠిం చారు. కార్యక్రమంలో భగవత సేవాసమాజ్ కమిటీ అధ్యక్షుడు సముద్రాలసూరయ్య, సభ్యులు శ్రీనివాస్, మధు, పార్థసారధిక్రిష్ణ, భక్తులు పాల్గొన్నారు. అలాగే కాళికాంబ చంద్రశేఖరస్వామి దేవస్థానంలో కాళికాంబదేవికి ఉదయాన్నే ప్రత్యేకపూజలు, కుంకుమార్చనలు చేశారు. అమ్మవారికి ప్ర త్యేక అలంకారం గావించి 108వెండి పుష్పాలచే అమ్మవారికి అష్టాదళపాదపద్మా రాధన సేవ కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ ఈవో లక్ష్మీ నారాయణ, అర్చకులు రాఘవేంద్ర,ఆచారి, శర్మలు, భక్తులు పాల్గొన్నారు.