నేటి నుంచి సంగమేశ్వరుడికి పూజలు
ABN , Publish Date - Mar 22 , 2026 | 11:10 PM
ఎనిమిది నెలలుగా సప్తనది జలాల్లో నిక్షిప్తమైన సంగమేశ్వరస్వామి ఆలయం శని వారం నాటికి పూర్తిగా బయల్పడింది.
ఎనిమిది నెలల అనంతరం భక్తులకు దర్శనభాగ్యం
ఆలయంలో బురద తొలగింపు
కొత్తపల్లి, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): ఎనిమిది నెలలుగా సప్తనది జలాల్లో నిక్షిప్తమైన సంగమేశ్వరస్వామి ఆలయం శని వారం నాటికి పూర్తిగా బయల్పడింది. అయితే.. నీరు పూర్తిగా తగ్గినప్పటికీ గర్భాలయంతో పాటు ఆలయ ప్రాంగణంలో భారీ ఎత్తున ఒండ్రుమట్టి చేరుకుంది. ఆలయ పురోహితుడు తెలక పల్లి రఘురామశర్మ ట్రాక్టర్లు, కూలీల సహకారంతో ఆదివారం బురదను తొలగింపజేశారు. అయితే ఆలయంలో కొద్దిమేర నీరు నిల్వ ఉండటంతో ట్రాక్టర్, మోటారు ద్వారా నీటికి బయటకు పంపించారు. కొంత మేర మోటార్లు ఇబ్బంది కలిగిస్తున్నప్పటికీ అధిక సంఖ్యలో కూలీలు, భక్తుల సహకా రంతో ఆదివారం రాత్రికి బురదను తొలగించారు. ఇదిలా ఉంటే శివునికి ప్రీతికరమైన సోమవారం పర్వదినం కావడంతో వేపదారు శివలింగానికి ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తామని పురోహితుడు తెలిపారు.