నందీశ్వరుడి పూజలు
ABN , Publish Date - Jul 12 , 2026 | 11:28 PM
శ్రీశైల మహాక్షేత్రంలో నందీశ్వరునికి ప్రత్యేక పూజల్లో భాగంగా బహుళ త్రయోదశి పూజలు శాస్రోక్తంగా అర్చక వేదపండితులతో ఈవో శ్రీనివాస రావు ఆధ్వర్యంలో నిర్వహించారు.
శ్రీశైలం, జూలై 12 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల మహాక్షేత్రంలో నందీశ్వరునికి ప్రత్యేక పూజల్లో భాగంగా బహుళ త్రయోదశి పూజలు శాస్రోక్తంగా అర్చక వేదపండితులతో ఈవో శ్రీనివాస రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆదివారం సాయంత్రం ప్రదోష కాల సమయంలో నందిమండపంలోని నందీశ్వరునికి లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చక వేదపండితులు మహా సంకల్పాన్ని పఠించి, గణపతి పూజానంతరం విశేషార్చనలు, పంచామృతాలు, ఫలోదకాలు, వివిధ రకాల ఉదకాలతో పాటు మల్లికా గుండం లోని నీటితో అభిషేకాలు జరిపించి నూతన వస్త్రాలు పూలమాల లతో అలంకరించి శనగలు నైవేద్యంగా నివేదన చేశారు.
మహానందిలో..
మహానంది క్షేత్రంలో నిజ జేష్ట మాసం బహుళ త్రయోదశి పురస్కరిం చుకొని ఆదివారం ప్రధాన ఆలయంలో రాతి నందీశ్వరుడికి వివిధ ద్రవ్యాలతో ఆలయ వేదపండితులు నందీశ్వరాభి షేకం వైభవంగా జరిపారు. అనంతరం ప్రత్యేక పూజలు జరిపారు. ప్రధాన అర్చకుడు అర్జునశర్మ పాల్గొన్నారు.