Share News

డ్రోన్‌ సిటీలో ముమ్మరంగా పనులు

ABN , Publish Date - Aug 16 , 2026 | 11:53 PM

దేశంలోనే అతిపెద్ద డ్రోన్‌ హబ్‌ ఏర్పాటు చేయనున్న ఓర్వకల్లు ప్రాంతంలో భూములను పరిశీలించేందుకు ఈ నెల 18న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజెరపు రామ్మోహన్‌ నాయుడు, రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి టీజీ భరత్‌, రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, ముస్లిం మైనార్టీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, ఏపీఐఐసీ ఎండీ దినేష్‌ కుమార్‌, ఏపీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ యువరాజ్‌ రానున్నట్లు తహసీల్దార్‌ విద్యాసాగర్‌ తెలిపారు.

డ్రోన్‌ సిటీలో ముమ్మరంగా పనులు
డ్రోన్‌ సిటీలో ముమ్మరంగా జరుగుతున్న రోడ్డు పనులు

18న కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రులు రాక

ఓర్వకల్లు, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): దేశంలోనే అతిపెద్ద డ్రోన్‌ హబ్‌ ఏర్పాటు చేయనున్న ఓర్వకల్లు ప్రాంతంలో భూములను పరిశీలించేందుకు ఈ నెల 18న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజెరపు రామ్మోహన్‌ నాయుడు, రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి టీజీ భరత్‌, రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, ముస్లిం మైనార్టీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, ఏపీఐఐసీ ఎండీ దినేష్‌ కుమార్‌, ఏపీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ యువరాజ్‌ రానున్నట్లు తహసీల్దార్‌ విద్యాసాగర్‌ తెలిపారు. ఓర్వకల్లు మండలంలోని పాలకొలను, చింతలపల్లె, కొమరోలు గ్రామాల పొలిమేరల్లో 300 ఎకరాల స్థలంలో డ్రోన్‌ హబ్‌ ఏర్పాట్లుకు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. డ్రోన్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ఇప్పటికే భూములను ఏపీఐఐసీ స్వాధీనం చేసుకుని రైతులకు నష్టపరిహారం కూడా అందించింది. అయితే.. చింతలపల్లె గ్రామంలో సాగులో ఉన్న కొద్ది మంది రైతులకు నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంది. ఈ విషయంపై కలెక్టర్‌ ఏ.సిరిని రైతులు కోర గా.. విచారణ చేసి నష్టపరిహారం ఇవ్వాలని ఆర్డీవో సందీప్‌ కుమార్‌ను ఆదేశించారు. రూ.1000 కోట్ల పెట్టుబడులతో డ్రోన్‌ పాలసీ 2024-29 ఏపీ డ్రోన్‌ కార్పొరేషన్‌ రూపొందించింది. రూ.3వేల కోట్ల రాబడి లక్ష్యంగా కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. దీంతో స్థానికులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అలాగే ఇప్పటికే డ్రోన్‌ హబ్‌ పనుల నిమిత్తం రూ.25 కోట్ల నిధులు మంజరయ్యాయి. 520 ఎకరాల్లో భవ్య ప్రాజెక్టుకు రూ.500 కోట్లు నిధులు కేటాయించి మౌలిక సదుపాయాల కోసం కేటాయించారు. 18న కేంద్ర మంత్రి రానున్న సందర్భంగా పను లు ముమ్మరంగా సాగుతున్నాయి. బహిరంగ సభకు 4 ఎకరాల్లో టెంట్లు ఏర్పాటు చేస్తున్నారు.

Updated Date - Aug 16 , 2026 | 11:53 PM