సీసీబీ పనులు బాగున్నాయి
ABN , Publish Date - Aug 27 , 2026 | 12:07 AM
కర్నూలు జీజీహెచ్‌లో రూ.23.75 కోట్లతో నిర్మాణ పనులు పూర్తి చేసుకున్న క్రిటికల్ కేర్ బ్లాక్ (సీసీబీ) పనులు బాగా ఉన్నాయని ఢిల్లీకి చెందిన ఎన్‌హెచ్‌ఎం అండర్ సెక్రటరీ సునీల్ ప్రశంసించారు.
ఎన్‌హెచ్‌ఎం అండర్ సెక్రటరీ సునీల్
కర్నూలు హాస్పిటల్, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి):కర్నూలు జీజీహెచ్‌లో రూ.23.75 కోట్లతో నిర్మాణ పనులు పూర్తి చేసుకున్న క్రిటికల్ కేర్ బ్లాక్ (సీసీబీ) పనులు బాగా ఉన్నాయని ఢిల్లీకి చెందిన ఎన్‌హెచ్‌ఎం అండర్ సెక్రటరీ సునీల్ ప్రశంసించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఆయుష్మాన్ భారత్ కింద ఏర్పాటుచేసిన సీసీబీని హాస్పిటల్ సూపరింటెండెంట్ డా.కే.వెంకటేశ్వర్లు, డీఎంహెచ్‌వో డా.వై.కామేశ్వర ప్రసాద్‌తో కలిసి బుధవారం ఆయన పరిశీలించారు. పనులు త్వరగా పూర్తిచేసిన ఏపీఎంఎ్‌సఐడీసీ ఇంజనీర్లను అభినం దించారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డా.కే.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ నెల 31న సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా చేతుల మీదుగా రాష్ట్రంలోని 8 క్రిటికల్ కేర్ బ్లాక్‌లు వర్చువల్‌గా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. న్యూడయోగ్నస్టిక్ బ్లాక్‌లోని మూడవ, నాల్గవ అంతస్థులో 50 పడకలతో క్రిటికల్ బ్లాక్ ఏర్పాటు చేశామని, పనులు పూర్తయ్యా యన్నారు. మూడవ అంతస్థులో డయాలసిస్ యూనిట్, ఎమర్జెన్సీ వార్డు, మైనర్ ప్రొసీజర్ రూమ్, నాలుగో అంతస్థులో మాడ్యులర్ ఓటీలు, ఫ్రీపోస్ట్ ఆపరేటివ్ రూమ్‌లతో పాటు ఎస్‌ఐసీయు ఉంటాయన్నారు. ఆర్‌ఎంవో డా.టీసీహెచ్ వెంకటరమణ, అనస్థీషియా హెచ్‌వోడీ డా.సుధీర్, నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్-2 శ్రీగౌరి, ఇంజనీర్లు పాల్గొన్నారు.