Share News

కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి

ABN , Publish Date - May 26 , 2026 | 12:25 AM

స్థానిక జీజీహెచలో పని చేసే పారిశుధ్య కార్మికులను అక్రమంగా తొలగించారని, వారిని తిరిగి విధుల్లో తీసుకోవాలని, పెండింగ్‌ జీతాలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ అంజి బాబు, నగర ప్రధాన కార్యదర్శి విజయ రామాంజనేయులు డిమాండ్‌ చేశారు.

కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి
ధర్నా చేస్తున్న పారిశుధ్య కార్మికులు

కలెక్టరేట్‌ ఎదుట పారిశుధ్య కార్మికుల ధర్నా

కర్నూలు హాస్పిటల్‌, మే 25(ఆంధ్రజ్యోతి): స్థానిక జీజీహెచలో పని చేసే పారిశుధ్య కార్మికులను అక్రమంగా తొలగించారని, వారిని తిరిగి విధుల్లో తీసుకోవాలని, పెండింగ్‌ జీతాలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ అంజి బాబు, నగర ప్రధాన కార్యదర్శి విజయ రామాంజనేయులు డిమాండ్‌ చేశారు. సోమవారం కలెక్టరేట్‌ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులు ధర్నా చేశారు. ఈ సంద ర్భంగా సీఐటీయూ నాయకులు మాట్లా డుతూ కర్నూలు జీజీహెచ, మెడి కల్‌ కాలేజీ, హాస్టల్స్‌, ఐ-హా స్పిటల్‌, క్యాన్సర్‌ హాస్పిటల్‌లో పారిశుధ్య పనుల కోసం టెండర్లు దక్కించుకున్న పద్మావతి పెర్టిలిటీ ఏజెన్సీ 50 సంవత్సరాలు ఉన్న శానిటేషన కార్మికులను చట్టవిరుద్ధంగా తొలగించడం అన్యాయ మన్నారు. జీతాలు ఇవ్వాలని ఏజెన్సీ ఆఫీస్‌కు వెళ్లి అడిగితే మేనేజర్లు రత్నరాజు, వెంకటరమణ, ముగ్గురు కార్మికులపై నిందలు వేసి డ్యూటీలు వేయకుండా 25 రోజులు వేధిస్తున్నారన్నారు. అనంతరం కర్నూలు జీజీహెచకు చేరుకుని హాస్పి టల్‌ అడ్మినిస్ర్టే టర్‌ సింధూ సుబ్రహ్మణ్యంకు సమ్మె నోటీసు అందజేశారు.

Updated Date - May 26 , 2026 | 12:25 AM