Share News

లక్ష్య సాధనకు కృషి చేయండి

ABN , Publish Date - Mar 20 , 2026 | 11:58 PM

జిల్లాలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జీడీడీపీ లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకొని వాటి లక్ష్యసాధన కోసం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్‌ డా.ఏ.సిరి ఆదేశించారు.

లక్ష్య సాధనకు కృషి చేయండి
మాట్లాడుతున్న కలెక్టర్‌ డా. సిరి

కలెక్టర్‌ డా.ఏ. సిరి

కర్నూలు కలెక్టరేట్‌, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జీడీడీపీ లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకొని వాటి లక్ష్యసాధన కోసం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్‌ డా.ఏ.సిరి ఆదేశించారు. శుక్ర వారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జీడీ డీపీ కీలక పనితీరు సూచికలు (కీ పర్ఫార్మెన్స్‌ ఇండికేటర్స్‌) అంశాలపై సం బంధిత అధి కారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని మం డల, నియోజకవర్గ స్పెషల్‌ అధికారులు ప్రతిఇంటికి సంబం ధించిన మౌలిక సదుపాయాలను సమగ్రంగా పరిశీలిం చాలన్నారు. జిల్లాలో అమలవుతున్న పీ-4 కార్యక్రమం ద్వారా బంగారు కుటుంబాలకు మార్గదర్శకు లను అనుసంధానం చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఓర్వకల్లు ఇండస్ర్టీయల్‌ నోడ్‌లో 100 ఎకరాల స్థలం ఏర్పాటు, ఓర్వకల్లు ఎయిర్‌పోర్టులో ఏవియేషన్‌ మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం అవసరమైన 38ఎకరాల భూమి సమీకరణ, హెలి పోర్టుకు స్థలం ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. జడ్పీ సీఈవో నాసరరెడ్డి, సీపీవో భారతి, ఐసీడీఎస్‌ పీడీ విజయ, డీసీహెచ్‌ఎస్‌ జఫ్రుల్లా, ఎంప్లాయిమెంట్‌ ఆఫీసర్‌ దీప్తి, డీఈవో సుధాకర్‌, డీటీవో రామచంద్రరావు పాల్గొన్నారు.

Updated Date - Mar 20 , 2026 | 11:58 PM