యోగా దినోత్సవానికి పనిచేయండి
ABN , Publish Date - Jun 12 , 2026 | 12:07 AM
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 21న జిల్లాలో నిర్వహించనున్న కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు, యోగా అసోసియేషన్లు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ రాజకుమారి సూచించారు.
కలెక్టర్ రాజకుమారి
నంద్యాల నూనెపల్లి, జూన్ 11 (ఆంధ్రజ్యోతి) : అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 21న జిల్లాలో నిర్వహించనున్న కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు, యోగా అసోసియేషన్లు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ రాజకుమారి సూచించారు. గురువారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో యోగా అసోసియేషన్ ప్రతినిధులు, సభ్యులు, సంబంధిత శాఖల అధికారులతో సమావేశమై యోగా ప్రచార కార్యక్ర మాలు, ప్రజల్లో యోగాపై అవగాహన పెంచే చర్యలు, నిర్వహణ ఏర్పాట్ల గురించి అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో యోగా అసోసి యేషన్ ప్రతినిధులు, ఆయుష్ కోఆర్డినేటర్ డా. యశోధర, డీఎస్డీఓ రాజు తదితరులు పాల్గొన్నారు.