సమన్వయంతో పార్టీని గెలిపించాలి
ABN , Publish Date - Oct 15 , 2026 | 12:05 AM
స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి టీడీపీని గెలిపించాలని నంద్యాల జిల్లా ఇన్చార్జి మంత్రి పయ్యావుల కేశవ్, పరిశీలకుడు ప్రభాకర్ చౌదరి కోరారు. బుధవారం రాత్రి పట్టణంలోని కోట్ల నివాసంలో ఎమ్మెల్యే దంపతులతో సమావేశమయ్యారు.
ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్
డోన్ టౌన్, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి టీడీపీని గెలిపించాలని నంద్యాల జిల్లా ఇన్చార్జి మంత్రి పయ్యావుల కేశవ్, పరిశీలకుడు ప్రభాకర్ చౌదరి కోరారు. బుధవారం రాత్రి పట్టణంలోని కోట్ల నివాసంలో ఎమ్మెల్యే దంపతులతో సమావేశమయ్యారు. ఎన్నికల సన్నద్ధత, అభ్యర్థుల ఎంపిక, పార్టీ బలోపేతం, వార్డుల వారీగా రాజకీయ పరిస్థితులు తదితర అంశాలపై చర్చించారు. క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండి, వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలని కోరారు. జిల్లా ఉపాధ్యక్షుడు సలీంధ్ర శ్రీనివాసులు యాదవ్, సంధు వెంకటరమణ, హేమ సుందర్ రెడ్డి పాల్గొన్నారు.
టీడీపీతోనే పల్లె ప్రగతి
ప్యాపిలి: టీడీపీతోనే పల్లె ప్రగతి సాధ్యమని డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకా్‌షరెడ్డి అన్నారు. బుధవారం మాధవరం, ప్యాపిలి, గుడిపాడు, మాందొడ్డి, కలచట్ల గ్రామాల్లో పల్లెపండుగ 3.0 నిధులు రూ.50లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులన ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని, ప్రతి గ్రామంలో రోడ్డు నిర్మించి ప్రజలకు మెరుగైన సేవలందిస్తున్నామన్నారు. వాటర్‌గ్రిడ్ పథకం ద్వారా గ్రామాలకు నీరందిస్తున్నట్లు తెలిపారు.డీసీఎంఎస్ చైర్మన్ వై.నాగేశ్వరావుయాదవ్, మార్కెట్‌యార్డు చైర్పర్సన్ రాజా రేణుక, ప్రభాకర్‌రెడ్డి, రామ్‌కుమార్, సీతపతి స్వామి, బత్తుల రమే్‌షరెడ్డి, ప్రసాద్, అంకిరెడ్డి, టి. శ్రీనివాసులు, ఖాజాపీర్, రామ్మోహన్‌యాదవ్, సత్యం, రాజశేఖర్‌నాయుడు, ప్రసాద్‌రెడ్డి, కేసీ మద్దిలేటి, రవి, రమేష్, నాగేంద్ర పాల్గొన్నారు.