Share News

టీడీపీ విజయమే లక్ష్యంగా పని చేయాలి

ABN , Publish Date - Oct 15 , 2026 | 11:58 PM

స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ విజయమే లక్ష్యంగా పని చేయాలని ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాష్‌ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు

టీడీపీ విజయమే లక్ష్యంగా పని చేయాలి
ఎమ్మెల్యే కోట్లను గజమాలతో సన్మానిస్తున్న కార్యకర్తలు

డోన్‌ టౌన్‌, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ విజయమే లక్ష్యంగా పని చేయాలని ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాష్‌ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ప్యాపిలి మండలం చిన్నపొదిల్ల గ్రామానికి చెందిన రాజశేఖర్‌రెడ్డితో పాటు 50 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. సీఎం చంద్రబాబు అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాయన్నారు. అనంతరం ఎమ్మెల్యేను గజమాలతో సన్మానించారు. లక్కసాగరం లక్ష్మిరెడ్డి, ఎద్దులదొడ్డి ప్రభాకర్‌ రెడ్డి, చండ్రపల్లి లక్ష్మీనారాయణ యాదవ్‌, ఆర్‌ఈ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 15 , 2026 | 11:58 PM