Share News

టీడీపీ విజయమే లక్ష్యంగా పని చేయండి

ABN , Publish Date - Oct 17 , 2026 | 11:45 PM

ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని మంత్రి బీసీ జనార్ధన్‌ రెడ్డి పేర్కొన్నారు. శనివారం పట్టణంలో పార్టీ కార్యాలయంలో సంజామల మండల నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.

టీడీపీ విజయమే లక్ష్యంగా పని చేయండి
నాయకులతో మాట్లాడుతున్న మంత్రి బీసీ

రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ

కోవెలకుంట్ల, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని మంత్రి బీసీ జనార్ధన్‌ రెడ్డి పేర్కొన్నారు. శనివారం పట్టణంలో పార్టీ కార్యాలయంలో సంజామల మండల నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన రోజే వైసీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా సృష్టిస్తున్న అల్లర్లు, అరాచకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలను కూటమి అభ్యర్ధులే కైవసం చేసుకుంటారని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. మంచాల మద్దిలేటి రెడ్డి, ఆల్వకొండ విష్ణుశేఖర్‌ రెడ్డి, ముక్కమల్ల చంద్రశేఖర్‌ రెడ్డి, కమలపురి జయమ్మ, కానాల కేశవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

పార్క్‌ను అభివృద్ధి చేస్తాం

పట్టణంలోని ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పార్క్‌ను అభివృద్ధి చేసి, ఆహ్లాదకరంగా తీర్చిదుద్దుతామ ని ఆర్‌అండ్‌బీ మంత్రి బీసీ జనార్ధన్‌ రెడ్డి పేర్కొన్నారు. శనివారం కుందూనది పక్కనే ఏర్పాటు చేస్తున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పార్క్‌ను అధికారులతో పరిశీలించారు. పనుల నాణ్యతలో రాజీ పడవవద్దని అధికారులకు సూచించారు. పనులు పూర్తయిన వెంటనే పార్క్‌లో ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి, దానకర్ణుడు బుడ్డా వెంగళ రెడ్డి విగ్రహాలను ఏర్పాటు చేయిస్తామని తెలిపారు. బనగానపల్లె మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ కాట్రెడ్డి మల్లికార్జున్‌ రెడ్డి, డిప్యూటీ ఎంపీడీవో ప్రకాష్‌ నాయుడు పాల్గొన్నారు.

Updated Date - Oct 17 , 2026 | 11:45 PM