చేనేతల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
ABN , Publish Date - Apr 02 , 2026 | 12:21 AM
చేసేతల భివృద్దికి కృషి చేస్తానని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. బుధవారం పట్టణంలోని పడకండ్ల గ్రామంలో పింఛన్ పంపిణీని ప్రారంభించారు. అనంతరం వీవర్స్ కాలనీలో చేనేత కార్మికుల మగ్గాలను పరిశీలించారు.
ఆళ్లగడ్డ, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): చేసేతల భివృద్దికి కృషి చేస్తానని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. బుధవారం పట్టణంలోని పడకండ్ల గ్రామంలో పింఛన్ పంపిణీని ప్రారంభించారు. అనంతరం వీవర్స్ కాలనీలో చేనేత కార్మికుల మగ్గాలను పరిశీలించారు. టీడీపీ ప్రభుత్వం నేటినుంచి చేనేతలకు ఉచిత విద్యుత్ ఇస్తుందని వారికి తెలిపారు. అనంతరం వీవర్స్ కాలనీలో చేనేత కుటుంబాలు అధిక సంఖ్యలో ఉండేవారని గత వైసిపి ప్రభుత్వ హయంలో కరెంటు చార్జీలు ఎక్కువగా రావడంతో నష్టపోయి, చాలామంది వలస వెల్లారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు పాలనలో చేనేతలకు మళ్లీ మంచి రోజులు వస్తున్నాయని, గతంలో వలస వెళ్లిన వారిని తిరిగి రప్పించి ఇక్కడే చీరలు నేసేలా చేస్తామన్నారు. శ్రీ కళాహస్తిలో కలంకారి వర్క్ ఎలా చేసి చూపిస్తున్నారో అలాగే అహోబిలంలో చూపించి వారికి ఉపాది కల్పించేలా చేస్తామని చేనేతలకు హామీ ఇచ్చారు. కౌన్సిలర్ హుసెన్‌బాషా, మున్సిపల్ మేనేజర్ ఆనంద్, సచివాలయ అధికారులు, టీడీపీ పాల్గొన్నారు.
రాష్ట్రాభివృద్ధి విషయంలో వైసీపీకి చిత్తశుద్ధి లేదు
నంద్యాల రూరల్: రాష్ట్రాభివృద్ధి విషయంలో వైసీపీకి చిత్తశుద్ది లేదని ఆళ్లగడ్డ ఎమ్యెల్యే అఖిలప్రియ విమర్శించారు. బుధవారం నంద్యాల తెలుగుగంగ కార్యాలయంలో చైర్మెన్ సంజీవకుమార్‌రెడ్డితో కలిసి సమావేశం నిర్వహించారు. అమరావతి రాజఽధాని బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందడంపై హర్షం వ్యక్తం చేశారు.చంద్రబాబును నమ్మి వేలాది రైతులు 30వేల ఎకరాలను త్యాగం చేస్తే వారిని కూడా వైసీపీ అధినేత జగన్ ఇబ్బందులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క రాజధాని నిర్మాణానికే తఅవస్థలు పడుతుంటే మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట ఆడిన జగన్ తీరు సరికాదన్నారు. అమరావతిలో పెట్టుబడులు, పరిశ్రమలు వచ్చి మరింత అభివృద్ధి చెందుతున్నారు. ఏప్రిల్ 10 వరకు ఆయకట్టుకు సాగునీరుఇస్తామన్నారు.