గిరిజనుల ఆర్థికాభివృద్ధికి కృషి
ABN , Publish Date - Aug 07 , 2026 | 12:17 AM
ప్రభుత్వం గిరిజన కుటుంబాల ఆర్థికాభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపడుతోందని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు.
ఆళ్లగడ్డ, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం గిరిజన కుటుంబాల ఆర్థికాభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపడుతోందని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. గురువారం అహోబిలంలో ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవల్‌పమెంట్ ప్రాజుక్టును ఎమ్మెల్యే ప్రారంభించారు. చెంచు కుటుంబాలకు 80శాతం సబ్సిడీపై గొర్రెలు, బర్రెలు కూరగాయల విత్తనాలు, కట్టుమిషన్లు, వ్యవసాయ పనిముట్లను పంపిణీ చేశారు. ఈ పథకాల ద్వారా గిరిజనులు ఉపాధి పొంది, వారి స్థితి మంరింత మెరుగు పడుతుందన్నారు. ఎంపీడీవో నూర్జహాన్, నాబార్డు ఏజీఎం కార్తిక్, డీఆర్‌డీఏ పీడీ శ్రీధర్‌రెడ్డి, డ్వామా పీడీ సూర్య నారయణ, ఐఐటీఏ మేనేజర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.