Share News

అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేయాలి

ABN , Publish Date - Oct 28 , 2026 | 11:53 PM

ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అభివృద్ధి, సంక్షేమానికి జడ్పీటీసీలు, ఎంపీటీసీలు కృషి చేయాలని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.

అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేయాలి
మాట్లాడుతున్న మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

బనగానపల్లె, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అభివృద్ధి, సంక్షేమానికి జడ్పీటీసీలు, ఎంపీటీసీలు కృషి చేయాలని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. బుధవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో బనగానపల్లె నియోజకర్గంలోని బనగానపల్లె, అవుకు, కొలిమిగుండ్ల, సంజామల, కోవెలకుంట్ల మండలాలకు చెందిన ఏకగ్రీవంగా ఎంపికైన కూటమికి చెందిన 5 జడ్పీటీసీలు, 56 ఎంపీటీసీలకు అభినందన సభ నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో జడ్పీటీసీ, ఎంపీటీసీలదే కీలక పాత్ర అని అన్నారు. నియోజకవర్గంలో వందశాతం జడ్పీటీసీలు, 78 శాతం ఎంపీటీసీలను ఏకగ్రీవం చేసుకున్నామన్నారు. పదవులు రాని వారికి భవిష్యత్‌లో ప్రాధాన్యత ఇస్తామని, వారు బాధపడవద్దన్నారు.

ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను తీర్చాలన్నారు. అఽధికారులతో సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కోరారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. శాంతిభద్రతలను పరిరక్షిస్తున్న పోలీసులను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్యదర్శి నంద్యాల రామేశ్వరరెడ్డి, అవుకు టీడీపీ మండలాధ్యక్షుడు ఉగ్రసేనారెడ్డి, కోవెలకుంట్ల క్లస్టర్‌ ఇన్‌చార్జి గడ్డం అమరనాథరెడ్డి, అవుకు మండల అధ్యక్షుడు మూలే రామేశ్వరరెడ్డి, బనగానపల్లె జడ్పీటీసీ బురా నుద్దీన్‌, కోటపాడు శివరామిరెడ్డి మాట్లాడుతూ మంత్రి బీసీ నిరంతరం చేస్తున్న అభివృద్ధిని కొనియాడారు.

Updated Date - Oct 28 , 2026 | 11:54 PM