బాధ్యతగా పనిచేయండి : జడ్పీ చైర్మన్
ABN , Publish Date - Jun 18 , 2026 | 11:46 PM
ఉద్యోగులు బాధ్యతగా పనిచేసినప్పుడే తగిన గుర్తింపు, గౌరవం దక్కుతుందని జడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి అన్నారు.
కర్నూలు న్యూసిటీ, జూన్ 18(ఆంధ్రజ్యోతి): ఉద్యోగులు బాధ్యతగా పనిచేసినప్పుడే తగిన గుర్తింపు, గౌరవం దక్కుతుందని జడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి అన్నారు. జిల్లా పరిషత్ పరిధిలో సీనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న ముగ్గురికి పరిపాలన అధికారులుగా పదో న్నతి కల్పిస్తూ జిల్లా పరిషత్ సీఈఓ జీవీ రమణారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతులతో పాటు పోస్టింగ్ ఆర్డర్లను జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపి రెడ్డి గురువారం జడ్పీ కార్యాలయంలో ఆయన చాంబర్‌లో అధికారులకు అందజేశారు. ఆదోని ఎంపీపీ కార్యాలయంలో పనిచేస్తున్న వీరభద్రయ్యకు కౌతాళం ఎంపీపీ, పంచాయతీరాజ్ క్వాలిటీ కంట్రోల్ కర్నూలు సబ్ డివిజన్ కార్యాలయంలో పని చేస్తున్న గిడ్డమూర్తిను జిల్లా పరిషత్‌కు, పాణ్యం ఎంపీపీ కార్యాలయంలో పని చేస్తున్న ఏవీ. రమణయ్యను ఆత్మకూరు ఎంపీపీ కార్యాలయానికి కేటాయించారు. ఈ కార్యక్రమలో జిల్లా పరిషత్ సీఈవో జీవీ. రమణారెడ్డి, డిప్యూటీ సీఈవో వెంకటసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.