సమన్వయంతో పని చేయండి
ABN , Publish Date - Mar 07 , 2026 | 11:07 PM
పదో తరగతి పరీక్షలపై ప్రతి అఽఽధికారి సమన్వయంతో పనిచేయాలని డీఈవో జనార్దన్‌రెడ్డి ఆదేశించారు.
డీఈవో జనార్దన్‌రెడ్డి
నంద్యాల ఎడ్యుకేషన్, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షలపై ప్రతి అఽఽధికారి సమన్వయంతో పనిచేయాలని డీఈవో జనార్దన్‌రెడ్డి ఆదేశించారు. నంద్యాల సమగ్రశిక్షా కార్యాల యంలో పరీక్షల నిర్వహణపై సమగ్రశిక్ష ఏపీసీ నిత్యానందరాజుతో కలిసి డీఈవో అధికా రులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పది పరీక్షల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పరీక్షల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకో వాలని, ఎక్కడా ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తప్పవన్నారు. డీవైఈవోలు శంకరప్రసాద్, వెంకట్రామిరెడ్డి, ఎస్‌ఎస్‌ఏ సంపత్, ఎంఐఎస్ కోఆర్డినేటర్ జగన్‌మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.