Share News

క్రీడాభివృద్ధికి కృషి

ABN , Publish Date - Feb 16 , 2026 | 01:06 AM

క్రీడాభివృద్ధికి కృషి చేస్తామని, జిల్లాలో పవ ర్‌ లిఫ్టింగ్‌ క్రీడాకారులకు క్రీడా సామగ్రిని అందజేస్తామని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ అన్నారు.

క్రీడాభివృద్ధికి కృషి
పవర్‌ లిఫ్టర్లతో రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ

రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్‌

పవర్‌ లిఫ్టింగ్‌ విజేతలకు బహుమతి ప్రదానం

కర్నూలు స్పోర్ట్స్‌, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): క్రీడాభివృద్ధికి కృషి చేస్తామని, జిల్లాలో పవ ర్‌ లిఫ్టింగ్‌ క్రీడాకారులకు క్రీడా సామగ్రిని అందజేస్తామని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ అన్నారు. కర్నూలు డీఎ్‌సఏ ఔట్‌డోర్‌ స్టేడియంలో 3వ రాష్ట్ర స్థాయి పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో విజేతలకు (బాలబాలికలకు) టీజీవీ మెడల్స్‌ అందజేశారు. ఆయన మాట్లాడుతూ క్రీడలతో క్రమశిక్షణ, మంచి ఆరోగ్యం, స్నేహభావం అలవడుతుందన్నారు. వివిధ కేటగిరీల్లో నిర్వహించిన పవర్‌ లిఫ్టింగ్‌ పోటీలో కర్నూలు లిఫ్టర్స్‌ ప్రతిభ చాటి ఓవరాల్‌ చాంపియన్‌షి్‌ప సాధించారు. గుంటూరు, కృష్ణా, ఈస్ట్‌గోదావరి, కడప లిఫ్టర్స్‌ ప్రతిభ చాటారు.

Updated Date - Feb 16 , 2026 | 01:06 AM