Share News

ఇష్టంగా పని చేయండి

ABN , Publish Date - Apr 24 , 2026 | 11:09 PM

విధులను కష్టంగా భావించకుండా ఇష్టంగా చేయాలని, అప్పుడే మంచి ఫ లితాలు వస్తాయని నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబు లేసు సిబ్బందికి సూచించారు.

ఇష్టంగా పని చేయండి
మాట్లాడుతున్న నగర పాలక సంస్థ కమిషనర్‌ ఓబులేసు

ఒత్తిడి లేని పని తీరు వల్లే మంచి ఫలితాలు

నగర పాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు

కర్నూలు న్యూసిటీ, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): విధులను కష్టంగా భావించకుండా ఇష్టంగా చేయాలని, అప్పుడే మంచి ఫ లితాలు వస్తాయని నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబు లేసు సిబ్బందికి సూచించారు. శుక్రవారం ఎస్‌బీఐ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో అధికారులు, సిబ్బందితో నిర్వ హించిన పరిచయ సమావేశంలో కమిషనర్‌ మాట్లాడారు. భయపెట్టి పనులు చేయించే విధానం తనది కానది, ఎవ్వరినీ రాని పనులు చేయమని ఒత్తిడి చేయనని స్పష్టంచేశారు. విధు లకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందరూ పెంచుకో వాలన్నారు. కార్యాలయ పని వేళలు పాటిస్తూ, ఫైళ్లు పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు క్లియర్‌ చేయాలన్నారు. ప్రతిరోజు ఉదయం క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజాసమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలని ఆదేశించారు. డ్రైనేజీ కాలువలపై ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించాలని, ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను త్వరగా పూర్తి చేయాలన్నారు. సమావేశంలో అడిషనల్‌ కమిషనర్‌ ఆర్‌ జీవి. కృష్ణ, డిప్యూటీ కమిషనర్‌ సతీష్‌కుమార్‌రెడ్డి, మేనేజర్‌ చిన్నారాముడు, కార్యదర్శి నాగరాజు, ఎస్‌ఈ జే. రమణమూర్తి, ప్రజారోగ్య అధికారి డా.ఎం. రఘు, ఇన్‌చార్జి సిటీ ప్లానర్‌ వెంకట రమణ, అకౌంట్స్‌ ఆఫీసర్‌ రఘునందన్‌, ఆర్‌వోలు స్వర్ణలత, వాజిద్‌, ఎంఈలు మనోహర్‌రెడ్డి, గిరిరాజు పాల్గొన్నారు.

Updated Date - Apr 24 , 2026 | 11:09 PM