Share News

ఆర్‌యూలో ముగిసిన మహిళా క్రీడా పోటీలు

ABN , Publish Date - Nov 10 , 2026 | 11:44 PM

స్థానిక అవుట్‌డోర్‌ స్టేడియంలో రాయలసీమ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్‌ కళాశాల మహిళా క్రీడా పోటీలు మంగళవా రం ఘనంగా ముగిశాయి.

ఆర్‌యూలో ముగిసిన మహిళా క్రీడా పోటీలు
విద్యార్థినులకు ట్రోఫీ అందజేస్తున్న అతిథులు

కర్నూలు స్పోర్ట్స్‌, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): స్థానిక అవుట్‌డోర్‌ స్టేడియంలో రాయలసీమ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్‌ కళాశాల మహిళా క్రీడా పోటీలు మంగళవా రం ఘనంగా ముగిశాయి. ఈ పోటీలు ప్రభుత్వ ఉన్నత విద్యా అధ్యయన సంస్థ కళాశాల ఆఫ్‌ టీచర్స్‌ ఎడ్యుకేషన ఆధ్వర్యంలో జరి గాయి. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్‌ డా.ఆర్‌. ఆదినారాయణ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై క్రీడాకారిణులను అభినందించారు. ఈ పోటీలకు ఐఏఎస్‌ఈ కళాశాల ఫిజికల్‌ ఎడ్యుకేషన అధ్యాపకులు డా.వై.కళ్యాణ్‌ కుమార్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా వ్యవహరించారు. అనంతరం వారు మాట్లాడుతూ మహిళలు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. అనంతరం విజేతలను ప్రకటించారు. చెస్‌ విజేతలుగా విన్నర్‌ సెయింట్‌ జోసెఫ్‌ డిగ్రీ కళాశాల, రన్నర్‌గా ఐఏఎస్‌ఈ, కర్నూలు నిలిచారు. వాలీబాల్‌ పోటీల విజేతలుగా విన్నర్‌గా రాయలసీమ యూనివర్సిటీ కళాశాల, రన్నర్‌గా సెయింట్‌ జోసెఫ్‌ డిగ్రీ కళాశాల జట్లు నిలిచిందన్నారు. అనంతరం విజేతలకు ట్రోఫీ, ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఆర్‌యూ ఫిజి కల్‌ డైరెక్టర్‌ శివకిషోర్‌, మూర్తి, వెంకటేశ, తారకేష్‌, ఈదుర్స్‌, రాజు, మధు, వినోద్‌, కోచ రవి, రాజేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 10 , 2026 | 11:44 PM