మహిళల భద్రతే లక్ష్యం
ABN , Publish Date - Jul 31 , 2026 | 11:31 PM
మహిళల భద్రతే లక్ష్యంగా పని చేస్తూ.. మహిళలపై జరిగే నేరాలపై తక్షణమే స్పందిం చాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ పోలీస్ అదికారులను ఆదేశిం చారు.
పెండింగ్ కేసులను పూర్తి చేయండి
ఎస్పీ విక్రాంత్ పాటిల్
కర్నూలు క్రైం, జూలై 31 (ఆంధ్రజ్యోతి): మహిళల భద్రతే లక్ష్యంగా పని చేస్తూ.. మహిళలపై జరిగే నేరాలపై తక్షణమే స్పందిం చాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ పోలీస్ అదికారులను ఆదేశిం చారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో డీఎస్పీలు, సీఐలతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలీస్ స్టేషన్ల వారిగా చీటింగ్ కేసులు, వైట్ కాలర్ నేరాల జాబితాను సిద్ధం చేసి పురోగతిపై నిరంతరం సమీక్షించాలన్నారు. మిస్సింగ్ కేసులు, ప్రాపర్టీ నేరాల దర్యాప్తును పకడ్బందీగా చేపట్టాలన్నారు. సైబర్ నేరాల కేసులో త్వరితగతిన న్యాయం జరిగేలా చొరవ తీసుకోవాలన్నారు. సీసీఎస్ పోలీసులు బృందాలుగా ఏర్పడి ప్రాపర్టీ నేరాలను చేధించా లన్నారు. పీజీఆర్‌ఎస్‌కు వచ్చే ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించా లన్నారు. కార్యక్రమంలో అడిషినల్ ఎస్పీ హుశేన్‌పీరా, లీగల్ అడ్వైజర్ మల్లికార్జున రావు, డీఎస్పీలు వెంకట్రామయ్య, రాఘవేంద్ర పాల్గొన్నారు.