Share News

తాగునీటి కోసం మహిళల నిరసన

ABN , Publish Date - Feb 06 , 2026 | 12:13 AM

తాగునీటి కోసం గూడూరు లోని సింగనగేరికి చెందిన మహిళలు నగర పంచాయతీ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు.

తాగునీటి కోసం మహిళల నిరసన
నగర పంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలు

గూడూరు, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): తాగునీటి కోసం గూడూరు లోని సింగనగేరికి చెందిన మహిళలు నగర పంచాయతీ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు. ఈ సందర్భంగా మహి ళలు మాట్లాడుతూ గత కొన్ని రోజలుగా తమ కాలనీకి నీటి సరఫరా సక్రమం గా జరడంలేదని, ఎన్నిమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేదన్నారు. కొన్నేళ్ల క్రితం తిమ్మగురుడు స్వామి ఆలయం వెనుక ఉన్న ఓవర్‌ హెడ్‌ ట్యాంకు శిథిలావస్థకు చేరడంతో అధికారులు కూల్చి వేశా రు. అప్పటి నుంచి తమకు తాగునీటి కష్టాలు తప్పడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై కమిషనర్‌ను ఫోనలో సంప్రదించగా సిం గనగేరి కాలనీలో నీటి సమస్యపై పరిశీలించాలని ఏఈని ఆదేశించామన్నారు.

Updated Date - Feb 06 , 2026 | 12:14 AM