సమాఖ్యలతో మహిళా సాధికారత
ABN , Publish Date - Jul 23 , 2026 | 11:52 PM
సమాఖ్యల బలోపేతమే మహిళల ఆర్థిక సాధికారతకు సాధ్యమని సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (సెర్ప్) ఏపీ అదనపు ముఖ్య కార్యనిర్వహణ అధికారి శ్రీరాములు నాయుడు సూచించారు.
సెర్ప్ ఏపీ అదనపు సీఈవో శ్రీరాములు నాయుడు
ఓర్వకల్లు, జూలై 23 (ఆంధ్రజ్యోతి): సమాఖ్యల బలోపేతమే మహిళల ఆర్థిక సాధికారతకు సాధ్యమని సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (సెర్ప్) ఏపీ అదనపు ముఖ్య కార్యనిర్వహణ అధికారి శ్రీరాములు నాయుడు సూచించారు. ఓర్వకల్లులోని ఓర్వకల్లు మండల పొదుపు లక్ష్మి ఐక్య సంఘం (ఓంప్లిస్) కార్యాలయంలో గురువారం రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన జిల్లా సమాఖ్య పతాధికారులకు నిర్వహిస్తున్న రెండు రోజుల రాష్ట్ర స్థాయి శిక్షణా కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఓంప్లిస్ గౌరవ సలహాదారు బి.విజయభారతి అధ్యక్షత వహించారు. శ్రీరాములు నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 600 మండల సమాఖ్యాల్లో 48లక్షల మంది సభ్యులు ఉన్నారని తెలిపారు. మన డబ్బులు- మన లెక్కలు మొబైల్ యాప్ ద్వారా ఆర్థిక లావాదేవీలు పారదర్శకంగా నిర్వహించడంతో పాటు త్వరలో సభ్యుల వ్యక్తిగత ఆరోగ్య వివరాలు కూడా యాప్‌లో అందుబాటులోకి రానున్నట్లు ఆయన వెల్లడిం చారు. సమాఖ్య సభ్యులు వ్యక్తిగత ప్రయోజనాలకంటే సంస్థ అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని, నాయకత్వ నైపుణ్యాలు, ఆర్థిక క్రమశిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో మహిళల ఆర్థిక స్వావలంబన మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. అనంతరం మండల సమాఖ్య ఆధ్వర్యంలో జరుగుతున్న బాలభారతి పాఠశాలను సందర్శించారు. మండల సమైఖ్య ద్వారా నిర్వహిస్తున్న జ్యూట్ బ్యాగ్ సెంటర్‌ను సంద ర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కెనరా బ్యాంకు ఆధ్వర్యంలో నిర్వహించే టైలరింగ్ సెంటర్‌ను ప్రారంభించారు. హుశేనాపురం వెంకటే శ్వర గ్రూపు సభ్యులతో ముఖాముఖి చర్చ నిర్వహించారు. అనంతరం ఓర్వకల్లు పొదుపు మహిళల స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. పొదుపు ఉద్యమం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు పొందా ర్నారు. కార్యక్రమంలో 28 జిల్లాల నుంచి జిల్లా సమాఖ్య పతాధికారులు శిక్షణకు హాజరయ్యారు. కర్నూలు, నంద్యాల జిల్లాల డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్లు బి.శ్రీధర్‌రావు, వైబీ శ్రీధర్ రెడ్డి, డీపీఎంలు నవీన్, రెహమాన్, ప్రభావతి, ఏపీఎంలు శ్రీనివాసులు, వెంకట్రామిరెడ్డి, పొదుపు మహిళలు పాల్గొన్నారు.