Share News

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే f

ABN , Publish Date - May 04 , 2026 | 12:08 AM

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు.

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే f
మాట్లాడుతున్న ఎమ్మెల్యే దస్తగిరి

గూడూరు, మే 3(ఆంధ్రజ్యోతి): మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు. ఆది వారం గూడూరులో కోడుమూరు సీఐ తబ్రేజ్‌, ఎస్‌ఐ రాజా కుళ్ళా యప్ప ఆధ్వ ర్యంలో నిర్వహించిన మహిళలపై నేరాలు అవగాహన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలకు ప్రభుత్వం అండగా ఉందని, వారు ఎలాంటి భయాం దోళనలకు గురికాకుండా ధైర్యంగా ముందుకు వెళ్లాలన్నారు. సమస్య లు ఎదురైనప్పుడు స్త్రీ శక్తి యాప్‌ ద్వారా పోలీసులను సంప్రదించా లన్నారు. అనంతరం ఇంటర్‌ పరీక్షా ఫలితాల్లో మంచి మార్కులను సాధించిన విద్యార్థినులను సత్కరించారు. కార్యక్రమంలో కమిషనర్‌ రమేష్‌ బాబు, పట్టణ టీడీపీ అధ్యక్షుడు కురుకుంద రామాంజనే యులు, సింగిల్‌ విండో డైరెక్టర్‌ రేమట వెంకటేశ్వర్లు, మాజీ కౌన్సిలర్‌ కోడుమూరు షాషావలి, టీడీపీ నాయకులు పౌలు, మన్సూర్‌, తెలుగు శ్రీనివాసులు, అంగనవాడీ, ఆశా, మెప్మా, మహిళా శక్తి టీం పోలీసులు పాల్గొన్నారు.

Updated Date - May 04 , 2026 | 12:08 AM