సమాజాన్ని మార్చేశక్తి మహిళలకే ఉంది
ABN , Publish Date - Mar 11 , 2026 | 12:14 AM
సమాజాన్ని మార్చేశక్తి మహిళలకే ఉందని కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టిన రసమ్మ అన్నారు.
కేఎంసీ ప్రిన్సిపాల్ కె. చిట్టినరసమ్మ
కర్నూలు హాస్పిటల్, మార్చి 10(ఆంధ్రజ్యోతి): సమాజాన్ని మార్చేశక్తి మహిళలకే ఉందని కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టిన రసమ్మ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా కర్నూలు మెడికల్ కాలేజీలో మహిళల సాధికారిత, సమానత్వాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో మంగళవారం మహిళా వైద్యులు వాక్‌థాన నిర్వహించారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ మహిళలు కుటుంబ నుంచి దేశ నిర్మాణం వరకు ప్రతి రంగంలో కీలకపాత్ర పోషిస్తున్నారన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రేణుకాదేవి, డిప్యూటీ సూపరింటెండెంట్ డా. లక్ష్మీబాయి, పెథాలజి హెచవోడీ డా. బాలేశ్వరి, ఎనఎస్‌ఎస్ ఆఫీసర్ డా. అరుణ, వైద్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.