Share News

మహిళ ఆత్మహత్యాయత్నం

ABN , Publish Date - Jan 14 , 2026 | 12:34 AM

మండలంలోని తిమ్మాపురం గ్రామంలో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన ఇరువురి మధ్య కొంత కాలంగా స్థల వివాదం కొనసాగుతోంది. దీనిపై పలుమార్లు ఇరువురు ఘర్షణ పడ్డారు

మహిళ ఆత్మహత్యాయత్నం
నంద్యాలలో చికిత్స పొందుతున్న జ్యోతి

ఏఎస్‌ఐ దుర్భాషలాడారని ఆరోపణలు

మహానంది, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): మండలంలోని తిమ్మాపురం గ్రామంలో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన ఇరువురి మధ్య కొంత కాలంగా స్థల వివాదం కొనసాగుతోంది. దీనిపై పలుమార్లు ఇరువురు ఘర్షణ పడ్డారు. మరోసారి ఈనెల 11న గ్రామానికి చెందిన శివమ్మ ఇంటి పక్కన ఉన్న జ్యోతి ఇరువురు ఇంటి స్ధలం సమస్యపై ఘర్షణ పడ్డారు. దీంతో శివమ్మ ముందుగా మహానంది పోలీ్‌సస్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసింది. అనంతరం జ్యోతి కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వచ్చింది. అక్కడ ఉన్న ఏఎ్‌సఐ తనను దుర్భాషలాడారని ఆమె రసాయన ద్రావణం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న కుటుంబీకులు చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటోంది. పోలీసు ఉన్నతాధికారులు స్పందించి, విచారణ చేసి, తమకు న్యాయం బాధితురాలి భర్త కేశవ కోరారు.

ఏఎ్‌సఐ దుర్భాషలాడలేదు

తిమ్మాపురం ఇంటి పక్కన ఉన్న ఇరువురు మహిళలు ఘర్షణ పడి ఫిర్యాదు చేయడానికి పోలీసుస్టేషన్‌కు వచ్చారని ఎస్‌ఐ రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. ఏఎ్‌సఐ వెంకటేశ్వర్లు సమస్యను పరిష్కరించేందుకు ఇరువురు మహిళలను ఒప్పించే ప్రయత్నించారన్నారు. బాధితురాలు జ్యోతిని దుర్భాషలాడటం అనేది ఆరోపణ మాత్రమేనని, ఇందులో నిజం లేదని అన్నారు. దీనికి సంభందించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు.

Updated Date - Jan 14 , 2026 | 12:34 AM