అట్టహాసంగా..
ABN , Publish Date - Nov 20 , 2026 | 10:58 PM
అట్టహాసంగా..
కొలువుదీరిన జడ్పీ పాలకవర్గం
మైనార్టీ వర్గానికి పెద్దపీట
జడ్పీ చైర్మన్‌గా షేక్ బుర్హానుద్దీన్
వైస్ చైర్మన్‌గా కాటంరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి
చైర్మన్, వైస్ చైర్మన్ల బాధ్యతల స్వీకరణ
హజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు
ఆనందంలో కూటమి నేతలు, నాయకులు, కార్యకర్తలు
నూతనంగా ఏర్పడిన నంద్యాల జిల్లాకు తొలి జడ్పీ పీఠాన్ని ముస్లిం మైనార్టీ వర్గానికి దక్కింది. నంద్యాల జిల్లా జడ్పీ చైర్మన్ స్థానం జనరల్‌కు కేటాయించి నప్పటికీ.. బీసీతో పాటు ముస్లిం వర్గానికి చెందిన బనగానపల్లె జడ్పీటీసీ సభ్యుడు షేక్ బుర్హానుద్దీన్‌కు అవకాశం దక్కడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముస్లింలకు అవకాశం ఇవ్వడంపై ఆయా సామాజికవర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జడ్పీ వైస్ చైర్మన్‌గా శిరివెళ్ల జడ్పీటీసీ సభ్యుడు కాటంరెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఎన్నికయ్యారు. నూతన జడ్పీ పాలకవర్గం కొలువుదీరింది.
నంద్యాల, నవంబరు20(ఆంధ్రజ్యోతి): జడ్పీ పాలకవర్గం అట్టహాసంగా కొలువుదీరింది. అనుహ్య పరిణామాల మధ్య జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఏకగ్రీవ ఎన్నిక అంతా ప్రశాంతంగా సాగింది. రాజకీయ వర్గాలతో ఆశావహులు సైతం ఊహించని విధంగా జడ్పీ చైర్మన్‌గా షేక్ బుర్హానుద్దీన్, వైస్ చైర్మన్‌గా కాటంరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి పేర్లు ఖరారు అయ్యాయి. జిల్లాకు తొలి జడ్పీ పీఠాన్ని ముస్లిం మైనార్టీ వర్గానికి దక్కింది. నంద్యాల జడ్పీ చైర్మన్ స్థానం జనరల్‌కు కేటాయించినప్పటికీ బీసీతో పాటు ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన బనగానపల్లె జడ్పీటీసీ సభ్యుడు షేక్ బుర్హానుద్దీన్‌కు అవకాశం దక్కడం చర్చనీయాంశమైంది.
కలెక్టర్ అధ్యక్షతన..
స్థానిక జిల్లా పరిషత్ ప్రాంగణంలో శుక్రవారం కలెక్టర్ రాజకుమారి అధ్యక్షతన నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని ఇద్దరు మంత్రులు ఎన్‌ఎండీ ఫరూక్, బీసీ జనార్దన్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు గౌరు చరితా రెడ్డి(జిల్లా అధ్యక్షురాలు), బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, గిత్తా జయసూర్యతో పాటు 28 మంది జడ్పీటీసీలు, జిల్లా పరిశీలకుడు వైకుంఠం ప్రభాకర్ చౌదరి హాజర య్యారు. ముందుగా జడ్పీటీసీలు, ఆతర్వాత చైర్మన్, వైస్ చైర్మన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఒక్కసారిగా కూటమి నేతలతో పాటు నాయకులు, కార్యకర్తల్లో ఒక్కసారిగా జోష్ నింపింది. వారంతో ఆనందంలో మునిగిపోయారు.
ఏకగ్రీవంగా..
జిల్లా పరిషత్ చైర్మన్‌గా బనగానపల్లె జడ్పీటీసీ షేక్ బుర్హానుద్దీన్‌ను పాణ్యం జడీటీసీ నంద్యాల రవికుమార్ ప్రతిపాదించగా.. పోలూరు రాఘవరావు బలపరచడంతో మిగి లిన జడ్పీటీసీలందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వైస్ చైర్మన్‌గా శిరివెళ్ల జడ్పీ టీసీ కాటంరెడ్డి శ్రీకాంత్‌రెడ్డిని చాగలమర్రి జడ్పీటీసీ నరసింహారెడ్డి ప్రతిపాదించగా ఆళ్లగడ్డ జడ్పీటీసీ పోరెడ్డి రాజశేఖర్‌రెడ్డి బలపరచగా మిగిలిన జడ్పీటీసీలందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరిద్దరి ఎంపిక ఒడిదుడుకులు లేకుండా ప్రశాంత వా తావరణంలో కొనసాగింది.
మొక్కలను అందజేసి..
షేక్ బుర్హానుద్దీన్ జడ్పీ చైర్మన్‌గా, కాటంరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి వైస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలతో పాటు కలెక్టర్ సైతం వారి ద్దరికి మొక్కలను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. వారు కూడా తమపై నమ్మకం ఉంచి ఎన్నిక చేసినందుకు ప్రతిఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
భారీగా తరలివచ్చిన..
జడ్పీ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారానికి జిల్లా నలుమూలల నుంచి కూటమి నాయకులు, కార్యకరలు నంద్యాలకు తరలివచ్చారు. జిల్లా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో సందడి నెలకొంది. వైసీపీ తరుఫున గెలిచిన ఐదుగురు జడ్పీటీసీలు కూడా తమ కార్యకర్తలు, నాయకులతో హాజరయ్యారు.
మధ్యాహ్నం 2:30 గంటలకు..
శుక్రవారం ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమైంది. 1:20 గంటల వరకు జడ్పీటీసీలు ప్రమాణ స్వీకారం చేశారు. 2:03 గంటల జడ్పీ చైర్మన్‌గా బుర్హానుద్దీన్, 2:10గంటలకు వైస్ చైర్మన్ కాటంరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారాలు పూర్తి చేశారు. అనంతరం జడ్పీ కార్యాలయంలో 2.30గంటలకు వీరిద్దరూ ఆయా పదవుల్లో బాధ్యతలు స్వీకరించారు.
మంత్రి బీసీకి అత్యంత సన్నిహితుడు
బనగానపల్లె జడ్పీటీసీగా షేక్ బుర్హానుద్దీన్ టీడీపీ తరుపున ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డికి అత్యం సన్నిహితుడు. గతంలో బనగానపల్లె ఉప సర్పం చ్‌గా, సొసైటీ డైరెక్టర్ పనిచేశారు. ఈయన రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీ నుంచి మొదలైంది. ఆతర్వాత మంత్రి బీసీ రాకతో 18 ఏళ్ల నుంచి టీడీపీలో క్రియాశీలకంగా కొనసాగుతున్నారు. బుర్హానుద్దీన్‌ను కూటమి ప్రభుత్వం జడ్పీ చైర్మన్‌గా అవకాశమిచ్చింది.
సుదీర్ఘకాలంగా వీరి కుటుంబం..
శిరివెళ్ల జడ్పీటీసీ కాటంరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి టీడీపీ తరుఫున 24,487 ఓట్ల భారీ మెజార్టీతో గె లుపొందారు. ఈయన మొదట నుంచి చైర్మన్ పీఠం కోసం ప్రయత్నించారు. చివరకు వైస్ చైర్మన్ పదవి దక్కింది. గతంలో ఈయన రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి డైరెక్టర్‌గా, టీడీపీ శిరివెళ్ల మండ లం కన్వీనర్‌గా, ఎంపీపీగా, రెండు సార్లు బోయలకుంట్ల సర్పంచ్‌గా, సింగిల్‌విండో ప్రెసిడెంట్‌గా పనిచేశారు. సుదీర్ఘ కాలం వీరి కుటుంబ టీడీపీలో కొనసాగింది.
జిల్లా సమగ్రాభివృద్ధికి పాటుపడుతా
జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార యంత్రాంగంతో సమష్టిగా పనిచేయడంతో పాటు జిల్లా సమగ్రాభివృద్ధికి కృషిచేస్తా. జిల్లా పరిషత్ చైర్మన్‌గా తనపై నమ్మకం ఉంచి ప్రకటించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పాటు జిల్లాలోని మంత్రులు, ఎమ్మె ల్యేలు, ఎంపీకి ప్రత్యేక కృతజ్ఞతలు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తా.
షేక్ బుర్హానుద్దీన్, జడ్పీ చైర్మన్, నంద్యాల
సమస్యలను పరిష్కరించడమే లక్ష్యం
గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, కాలువలు, తాగునీటి తదితర మౌళిక వసతులు కల్పించడంతో పాటు అన్నిరకాల సమస్యలను పరిష్కారించడమే లక్ష్యం. జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీతో పాటు అధికారులతో కలిసి జిల్లా అభివృద్ధికి కృషిచేస్తా. వైస్ చైర్మన్‌గా అవకాశం కల్పించిన సీఎం, డిప్యూటీ సీఎంలకు ప్రత్యేక కృతజ్ఞతలు.
కాటంరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్