Share News

ఈదురు గాలులతో నష్టం

ABN , Publish Date - Jul 12 , 2026 | 12:20 AM

అసలే వర్షాలు కురవక ఇబ్బందులు పడుతున్న రైతులను ఈదురు గాలులు దెబ్బతీస్తున్నాయి. వారం నుంచి పెను గాలలు వీస్తుండటంతో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది

ఈదురు గాలులతో నష్టం
కొలిమిగుండ్లలో బోరుబావి కింద సాగుచేసిన జొన్నపైరు

విద్యుత్‌ సరఫరాలో అంతరాయం

సాగునీరు అందక ఎండుతున్న పంటలు

కొలిమిగుండ్ల, జూలై 11 (ఆంధ్రజ్యోతి): అసలే వర్షాలు కురవక ఇబ్బందులు పడుతున్న రైతులను ఈదురు గాలులు దెబ్బతీస్తున్నాయి. వారం నుంచి పెను గాలలు వీస్తుండటంతో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. దీంతో బోరుబావుల కింద సాగుచేసిన పంటలకు సాగునీరందడం లేదు. ఖరీ్‌ఫలో రైతులు బావుల ఇంద 2,500 ఎకరాల్లో పంటలు సాగుచేశారు. విద్యుత్‌ సరఫరాలో అంతరాయంతో పంటలకు నీరందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే అయితే ఇక పంటలు ఎండిపోతాయని, విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలను అరికట్టాలని కోరుతున్నారు.

Updated Date - Jul 12 , 2026 | 12:20 AM