Share News

గాలి వాన బీభత్సం

ABN , Publish Date - May 07 , 2026 | 11:46 PM

: గాలివాన బీభత్సానికి పేరు సోములలో విద్యుత్‌ స్తంభాలు నేల కొరిగాయి. బుధవారం రాత్రి కురిసిన వర్షానికి, గాలులకు గ్రామంలో దాదాపు 30 విద్యుత్‌ స్థంభాలు, చెట్లు విరిగిపడ్డాయి.

గాలి వాన బీభత్సం
నేలవాలిన విద్యుత్‌ స్థంభాలను పునరుద్ధరిస్తున్న విద్యుత్‌ సిబ్బంది

విరిగిపడ్డ చెట్లు, విద్యుత్‌ స్తంభాలు

అంధకారంలో గ్రామాలు

సంజామల, మే 7 (ఆంధ్రజ్యోతి) : గాలివాన బీభత్సానికి పేరు సోములలో విద్యుత్‌ స్తంభాలు నేల కొరిగాయి. బుధవారం రాత్రి కురిసిన వర్షానికి, గాలులకు గ్రామంలో దాదాపు 30 విద్యుత్‌ స్థంభాలు, చెట్లు విరిగిపడ్డాయి. బుధవారం రాత్రి నుంచి పేరుసోముల, కంబవారిపల్లె, కోటపాడు, రామిరెడ్డిపల్లె గ్రామాలు అంధకారంలో ఉన్నాయి. ప్రధానంగా సబ్‌ స్టేషన్‌కు విద్యుత్‌ సరఫరా అయ్యే స్తంభాలు నేలవాలడంతో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఉదయాన్నే ఏఈ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో లైన్‌మెన్లు భాష, నాగరాజు యుద్ధప్రాతిపదికన విద్యుత్‌ స్తంభాలను పునరుద్ధరించారు. నివాస గృహాలపై, రోడ్డు పక్క పడ్డ చెట్లను కటింగ్‌ మిషన్లతో తొలగించారు. గ్రామంలోని మాదిగ హుస్సేని నివాస గృహంపై వేపచెట్టు కూలింది. గ్రామంలోని పలుచోట్ల రేకుల షెడ్లు గాలికి లేచిపోయాయి. గురువారం రాత్రి 8గంటలకు ఆయా గ్రామాలకు విద్యుత్‌ సరఫరాను అందజేశారు.

Updated Date - May 07 , 2026 | 11:46 PM