Share News

వార్త రాస్తే చంపేస్తారా?

ABN , Publish Date - Apr 30 , 2026 | 12:21 AM

విలేకరిని హత్యచేసిన నిందితులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని ఆళ్లగడ్డ వర్కింగ్‌ జర్నలిస్టులు డిమాండ్‌ చేశారు. బుధవారం జర్నలిస్టులు ఆళ్లగడ్డలో ర్యాలీ నిర్వహించి, డీటీ విజయలక్ష్మికి వినతి పత్రం అందజేశారు

వార్త రాస్తే చంపేస్తారా?
ఆళ్లగడ్డలో డీటీకి వినతి పత్రం ఇస్తున్న విలేకరులు

ఆంధ్రజ్యోతి విలేకరి జగన్‌మోహన్‌ రెడ్డి హత్యపై భగ్గుమన్న జర్నలిస్టులు, ప్రజా సంఘాల నాయకులు

నియోజకవర్గాల్లో ధర్నా, రాస్తారోకో

ఆళ్లగడ్డ, ఏప్రిల్‌ 29(ఆంధ్రజ్యోతి): విలేకరిని హత్యచేసిన నిందితులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని ఆళ్లగడ్డ వర్కింగ్‌ జర్నలిస్టులు డిమాండ్‌ చేశారు. బుధవారం జర్నలిస్టులు ఆళ్లగడ్డలో ర్యాలీ నిర్వహించి, డీటీ విజయలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. సీనియర్‌ జర్నలిస్టు శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పని చేసే జర్నలిస్టుల పై ఇలాంటి తరహా చర్యలు అత్యంత హేయమన్నారు. జర్నలిస్టులు ఖాదర్‌బాషా, సర్దార్‌, నిజాముద్దీన్‌, శ్రీనివాసరావు, ఇస్మాయిల్‌ బేగ్‌, ఓబుల్‌ కిరణ్‌, ప్యాపిలి ప్రసాద్‌, అక్షింతల శ్రీనివాసులు, అరుణ్‌, రమేష్‌, శ్యామ్‌, సునీల్‌ తదితరులు పాల్గొన్నారు.

బేతంచెర్ల: చిత్తూరు జిల్లా వి.కోట మండలం ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి విలేకరి జగన్‌మోహన్‌ రెడ్డిని హత్య చేసిన నిందితులను బహిరంగంగా శిక్షించాలని ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షుడు వెంకట్రాముడు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. బుధవారం పట్టణంలోని పాతబస్టాండ్‌లో రాస్తారోకో నిర్వహించారు. విలేకరి వెంకటేశ్వర్‌ గౌడ్‌, సీపీఐ మండల ప్రధాన కార్యదర్శి భార్గవ్‌, జనసేన నాయకుడు మద్దిలేటి, సీఐటీయూ నాయకుడు వేణుగోపాల్‌లు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం, ప్రజలకు వారధిగా పనిచేసే విలేకర్లపై దాడులను తీవ్రంగా ఖండించారు. పాత్రికేయులు మధు, సుబ్బరాయుడు, నాయుడు, సుబ్బయ్య, రాముడు, సుబ్బరాయుడు పాల్గొన్నారు.

డోన్‌ రూరల్‌, ఏప్రిల్‌ 29: విలేకరి హత్య దారుణమని డోన్‌ పట్టణ టీడీపీ యువ నాయకుడు వై. హనుమంతరెడ్డి అన్నారు. బుధవారం మాట్లాడుతూ హత్యకు పాల్పడిన రౌడీషీటర్‌ తమీమ్‌ను కఠినంగా శిక్షించాలని, జర్నలిస్టులకు రక్షణ కల్పించాలన్నారు.

బనగానపల్లె: విలేఖరి .జగన్‌ మోహన్‌రెడ్డి హత్య దారుణమని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు టంగుటూరు శీనయ్య , టీడీపీ నాయకుడు కూరగాయలశేఖర్‌; మల్లారెడ్డి, కోడి నాగేశ్‌, వంకదారి శేషప్రసాద్‌ పేర్కొన్నారు. బుధవారం బనగానపల్లెలో మాట్లాడుతూ శ్రీగందం మాషియా, అవినీతిపై వార్తలు రాసినందకు హత్యచేశారన్నారు. రౌడీషీటర్‌ను శిక్షించి ప్రభుత్వం విలేకరి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. అవినీతిపై వార్తలు రాస్తే విలేఖర్లను హత్య చేస్తారా అని బనగానపల్లె మండలంలోని ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఎంఆర్‌పీఎస్‌, బీజేపీ, దూదేకుల సంఘం నాయకులు మాట్లాడుతూ చిత్తూరు జిల్లా వీకోట ఆంధ్రజ్యోతి రిపోర్టుర్‌ జగన్‌మోహన్‌రెడ్డిని రౌడీషీటర్‌ హత్య చేయడం దారుణమన్నారు. శ్రీగంధంస్మగ్లర్లపై వార్తలు రాయడంతో జీర్ణించుకోలేక హత్య చేయడం ఘోరమన్నారు. పోలీసులు లోతుగా విచారణ జరిపి నిందితులపై కఠినచర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌చేశారు కాళింగిరి రాముడు, పెద్దమునెయ్య, రామకృష్ణ, మంగంపేట మద్దిలేటి, కంబగిరి, కంబగిరిస్వామి, నాగమద్దిలేటి, ఇమాంసాహెబ్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 30 , 2026 | 12:21 AM