వివాదాలకు చెక్ పడేనా?
ABN , Publish Date - Jun 14 , 2026 | 11:37 PM
రాయలసీమ యూనివర్సిటీలో వివాదాలకు చెక్ పడేలా చర్యలు తీసుకునే దిశగా అధికారులు పావులు కదుపుతున్నారు.
విజిలెన్ ్స విచారణకు మంత్రి టీజీ భరత్ ఆదేశం
నేటి నుంచి ఆర్‌యూలో తరగతులు ప్రారంభం
కర్నూలు అర్బన్, జూన్ 14(ఆంధ్రజ్యోతి): రాయలసీమ యూనివర్సిటీలో వివాదాలకు చెక్ పడేలా చర్యలు తీసుకునే దిశగా అధికారులు పావులు కదుపుతున్నారు. వర్సిటీ అధికా రులు, విద్యార్థి సంఘాల నాయకుల మధ్య ఆరు నెలలుగా వివా దం నడుస్తోంది. ఈ క్రమంలో వేసవి సెలవులు ముగించుకుని సోమవారం యూనివర్సిటీ ప్రారంభానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు. కొత్త విద్యా సంవత్సరం కొత్త ప్రణాళికతో అధికా రులు సిద్ధమయ్యారు. పాలనాపరమైన అంశాల్లో విద్యార్థుల జోక్యం వివాదానికి ఆజ్యం పోసింది. ఇప్పటికే విద్యార్థి సంఘాల నాయకులు వర్సిటీ అఽధికారుల తీరుపై పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌కు గత నెల 27న ఫిర్యాదు చేస్తూ వర్సిటీలో జరిగిన అక్రమాలపై విజిలెన్ ్స విచారణ జరిపించాలని కోరిన విషయం తెలిసిందే. స్పందించిన మంత్రి ఈనెల 12న ఫిర్యాదుపై విచారణ జరపాలంటూ.. డైరెక్టర్ విజిలెన్ ్స, ఎన్‌ఫోర్స్‌మెంటుకు లేఖ రాయడం చర్చనీయాంశమైంది.
పలు కారణాలతో విద్యార్థి నాయకులపై..
ఆందోళనలు చేస్తున్న విద్యార్థి నాయకులపై పలు కారణాలతో వర్సిటీ నుంచి డిస్మిస్ చేస్తూ అఽధికారులు చర్యలు తీసుకున్నారు. ఈక్రమంలో తాజాగా సోమవారం వర్సిటీ ప్రారంభ సమయంలో ఎలాంటి అలజడులు సృష్టించినా చర్యలు తప్పవని రిజిస్ర్టార్ విజ యకుమార్ నాయుడు హెచ్రించారు. ఈ క్రమంలో వర్సిటీ అఽధికారులు, విద్యార్థులను ఎలా డిస్మిస్ చేస్తారంటూ ఏఐఎస్‌ఎఫ్, ఆర్‌పీఎస్ విద్యార్థి సంఘాలు సమావేశాలు ఏ ర్పాటుచేసి అఽఽధికారుల తీరును తప్పు పట్టాయి. ఈక్రమంలో విద్యార్థి సంఘాలు, పూర్వ విద్యార్థులు, ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటుచేసి వర్సిటీ అధికారుల తీరుపై భవిష్యత్ ప్రణాళికను ప్రకటిస్తామని ఏఐఎస్‌ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు ప్రకటించారు.
ముగిసిన వేసవి సెలవులు
రాయలసీమ యూనివర్సిటీలో వేసవి సెలవులు ముగిశాయి. సోమవారం నుంచి వర్సిటీ తో పాటు అనుబంధంగా ఉన్న డిగ్రీ, పీజీ, బీఈడీ కళాశాలల నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతుంది. పోస్ట్ గ్రాడ్యూయేషన్ , డిగ్రీ, పీజీ, బీఈడీ తరగతులు ప్రారంభం కానున్నాయి. అందుకు తగ్గట్టుగా వర్సిటీ అధికారులు విదార్థులకు అవసరమైన వసతులు, సౌకర్యాలతో తగతిగదులు, వసతి గృహాలను సిద్ధం చేశారు.