Share News

బనగానపల్లెను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

ABN , Publish Date - Nov 20 , 2026 | 12:08 AM

మేజర్‌ పంచాయతీ బనగానపల్లెను ఆదర్శంగా తీర్చి దిద్దుతానని టీడీపీ నాయకురాలు బీసీ ఇందిరమ్మ అన్నారు.

బనగానపల్లెను ఆదర్శంగా తీర్చిదిద్దుతా
సర్పంచ్‌గా నామినేషన్‌ వేస్తున్న ఇందిరమ్మ

బనగానపల్లె, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): మేజర్‌ పంచాయతీ బనగానపల్లెను ఆదర్శంగా తీర్చి దిద్దుతానని టీడీపీ నాయకురాలు బీసీ ఇందిరమ్మ అన్నారు. సర్పంచ్‌ అభ్యర్థిగా గురువారం మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ బీసీ రాజారెడ్డి, పారిశ్రామికవేత్త బీసీ రామనాథరెడ్డితో కలిసి ఆర్‌వో సుభాషిని వద్ద నామినేషన్‌ దాఖలు చేశారు. తనభర్త మంత్రి బీసీ సహకారంతో సేవా కార్యక్రమాలు నిర్వహించానని, పట్టణంలో ప్లాస్టిక్‌ నియంత్రణకు కృషి చేశామన్నారు. సర్పంచ్‌గా గెలిపిస్తే మంత్రి బీసీ సహకారంతో పట్టణాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. బీసీ కుమారుడు బీసీ మనోహర్‌రెడ్డి, కోడలు క్షీరారెడ్డి, కుమార్తె మనోరమ, టంగుటూరు శ్రీనయ్య, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 20 , 2026 | 12:08 AM