Share News

వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని..

ABN , Publish Date - Sep 03 , 2026 | 12:18 AM

వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఓ భార్య తన భర్తను ప్రియుడితో కలిసి హతమార్చింది. ఈ కేసులో భార్యతో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు

వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని..
వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ, ఎస్‌ఐ

భర్త హత్య కేసులో భార్య, మరో ఇద్దరి అరెస్టు

ఆళ్లగడ్డ, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఓ భార్య తన భర్తను ప్రియుడితో కలిసి హతమార్చింది. ఈ కేసులో భార్యతో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. వివరాలు.. పట్టణంలోని మంగలి కాలనీకి చెందిన ఆంజనేయులు (27) గత నెల 31వ తేదీన హత్యకు గురయ్యాడు. మృతుడి భార్య నాగసుబ్బులు చాగలమర్రి మండలం తోడేండ్లపల్లెకి చెందిన గురుప్రసాద్‌ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్తను అడ్డు తొలగించేందుకు ప్లాన్‌ వేసింది. పథకం ప్రకారం ఆంజనేయులును క్రిష్ణాపురం రస్తాలోని పొలానికి రప్పించారు. భార్య, ఆమె ప్రియుడు, మరో వ్యక్తి బండరాయి, మద్యం బాట్లిళ్లతో అతడిని హత్య చేశారు. అనంతరం బైక్‌లో ఇద్దరు నిందితులు పరార య్యారు. భార్య నాగసుబ్బులు తనకు ఏమి తెలియనట్లు వ్యవహరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు గురుప్రసాద్‌, ప్రొద్దుటూరుకు చెందిన షరీఫ్‌, సుబ్బుఉను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును 24 గంటల్లోనే ఛేదించిన పట్టణ సీఐ నాగరాజారావు, ఎస్‌ఐలు చిన్న పీరయ్య, వరప్రసాద్‌, కానిస్టేబుళ్లు ఉదయ కుమార్‌, మహ్మద్‌ రఫీలను డీఎస్పీతో పాటు ఉన్నతాధికారులు అభినందించారు. ఎస్‌ఐలు రామక్రిష్ణారెడ్డి, శ్రీనివాసగౌడ్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు

Updated Date - Sep 03 , 2026 | 12:18 AM