ఉపాధి పథకం పేరు ఎందుకు మార్చారు?
ABN , Publish Date - Jan 10 , 2026 | 11:47 PM
: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును కేంద్ర ప్రభుత్వం ఎందుకు మార్చిందో చెప్పాలని రిటైర్డు ఐఏఎస్ అధికారి, కాంగ్రెస్ పార్టీ జాతీయ కమిటీ సభ్యుడు కొప్పుల రాజు డిమాండ్ చేశారు.
14న భోగి మంటల్లో జీ రామ్ జీ పథకం ప్రతులు దహనం
రిటైర్డు ఐఏఎస్ అధికారి, కాంగ్రెస్ పార్టీ జాతీయ కమిటీ సభ్యుడు కొప్పుల రాజు
కర్నూలు అర్బన్, జనవరి 10(ఆంధ్రజ్యోతి): మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును కేంద్ర ప్రభుత్వం ఎందుకు మార్చిందో చెప్పాలని రిటైర్డు ఐఏఎస్ అధికారి, కాంగ్రెస్ పార్టీ జాతీయ కమిటీ సభ్యుడు కొప్పుల రాజు డిమాండ్ చేశారు. శనివారం జిల్లా పరిషత్‌లోని సమావేశ భవనంలో సీపీఐ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని గ్రామీణ ఉపాధి హీమీ పథకం మీద ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ కోటేశ్వరరావు అధ్యక్షత సదస్సు జరిగింది. ఇందులో కొప్పుల రాజు మాట్లాడుతూ కొత్తగా ప్రకటించిన జీరామ్ జీ పథకానికి సంబంధించిన జీవో పత్రాలను ఈనెల 14న భోగి మంటల్లో ప్రతి మండలం కేంద్రంలో దహనం చేయాలని తీర్మానించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సీపీఐ తదితర పార్టీలతో కలిసి పోరాడుతామని అన్నారు. ఆ సదస్సులో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అవుల శేఖర్, సీపీఐ కార్యదర్శి వర్గ సభ్యుడు కె. రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి బి. గిడ్డయ్య తదితరులు పాల్గొన్నారు.